English | Telugu
ఆర్జే చైతుతో సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పిన శ్రీముఖి!
Updated : Jul 23, 2023
శ్రీముఖి.. టెలివిజన్ రంగంలో యాంకరింగ్ తో తన సత్తా చాటుతుంది. టీవీ రంగంలోనే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3 లో రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమాలల్లో వరుస ఆఫర్స్ తో బిజీ అయింది శ్రీముఖి.
జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలు పాత్రలో కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడీలో యాంకర్ గా చేసిన శ్రీముఖి పలు టీవి షోస్ , ఆడియో ఫంక్షన్స్ తో గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే తన హాట్ ఫోటోస్ ని ఈ మధ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని అటు యూట్యూబ్ లో వ్లాగ్ లుగా చేసి అప్లోడ్ చేస్తుంది. ఆర్జే చైతు కూడా తన మాట తీరుతో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. బిబి జోడీలో ఆర్జే కాజల్ తో కలిసి డ్యాన్స్ చేసిన చైతు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఇప్పుడు చైతు, శ్రీముఖితో కలిసి ఒక వ్లాగ్ చేశాడు. "వర్షాకాలంలో చికెన్ ఫ్రై ముచ్చట్లు " అని ఒక వ్లాగ్ ని తన ఛానెల్ లో అప్లోడ్ చేసింది శ్రీముఖి.
ఒక క్రియేచర్ నా ముందు ఉంది, ఆ ఆకారం నాట్యం చేస్తుందని ఆర్జే చైతు గురించి చెప్పింది శ్రీముఖి. శ్రీముఖి చేస్తున్న 'నీతోనే డ్యాన్స్' షోకి వస్తున్నట్టు ఆర్జే చైతు చెప్పాడు. "వర్షం పడుతుంది బయట. వర్క్ అయిపోయింది. ఫ్రెండ్స్ అంతా బిజీగా ఉన్నారు. శ్రీముఖి షూటింగ్ లేకుంటే ఇంట్లోనే ఉంటుంది కదా. ఆకలి అవుతుంది. మొన్న వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు చికెన్ ఫ్రై చేసింది. అది నాకు నచ్చింది. అది తినాలనిపించి వచ్చాను" అని ఆర్జే చైతు చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి చికెన్ ఫ్రై చేశారు. కాసేపు శ్రీముఖిని ఆర్జే చైతు కొన్ని ప్రశ్నలు వేయగా వాటికి సమాధానమిచ్చింది. నువ్వు మళ్ళీ పుట్టాలనుకుంటే ఏ దేశంలో పుట్టాలనుకుంటున్నావ్ అని ఆర్జే చైతు అడుగగా.. దుబాయ్ లో పుట్టాలనుకుంటానని శ్రీముఖి చెప్పింది. నీకు ఉన్న సీక్రెట్ బాయ్ ఫ్రెండ్, హస్బెండ్ గురించి చెప్పు అని ఆర్జే చైతు అడుగగా.. సీక్రెట్ అంటే అని చాలా సేపు ఆలోచించింది శ్రీముఖి. దాంతో చైతు వద్దులే అని అన్నాడు. కాగా ఇప్పుడు ఈ వ్లాగ్ కి విశేష స్పందన వస్తుంది.