Read more!

English | Telugu

లవ్ లేదు.. బొంగు లేదు.. కొవ్వు తగ్గిస్తా అంటున్న అఖిల్ సార్థక్!

 

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ ముందు వరకు ఎవరికి తెలియదనే చెప్పాలి. బిగ్ బాస్ 4 ఎంట్రీతోనే ప్రేక్షకులకు దగ్గరై ఫేమ్  సంపాదించుకున్నడు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు.. 'నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో' అని అన్నట్లుగా ఉండేవాడు అఖిల్. అతని బిహేవియర్ చాలా మందికి నచ్చేది కాదు. అంతేకాకుండా హౌస్ లో మోనాల్ గజ్జర్ గురించి అఖిల్, అభిజిత్ ల పంచాయతీ వీధుల్లో కుళాయిల దగ్గర ఉండే కొట్లాటలాగా ఉండేది. అఖిల్ బిగ్ బాస్-4 రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ఓటీటీలో కూడా మరోసారి ఎంట్రీ ఇచ్చి.. అందులో కూడా రన్నరప్ గానే నిలిచాడు.

అయితే తాజాగా అఖిల్ మంచి పాపులారిటీ సంపాదించుకొని.. ఈవెంట్స్, షోస్ తో బిజీ గా ఉంటున్నాడు. అంతేకాకుండా బిబి జోడిలో తేజస్వినితో జతకట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బిబి జోడి షోలో హాట్ పెర్ఫార్మన్స్ ఎవరంటే అఖిల్-తేజస్వినిల పేరే వినిపిస్తుందని అనడంలో ఆశ్చర్యమే లేదు. బిబి జోడీలో సైతం కౌశల్ తో.. నువ్వా నేనా అంటూ మాటల యుద్ధమే జరిగిందని చెప్పాలి. అయితే కొన్ని కారణాల వల్ల అఖిల్ జోడీ ఫైనల్ వరకు వెళ్ళలేదు. అఖిల్ కి కండరాల నొప్పి వల్ల తన కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో డాక్టర్లు కొన్నిరోజులు అఖిల్ ని డ్యాన్స్ చేయవద్దని చెప్పారంట.‌. అందుకనే బిబి జోడీ షో నుండి అఖిల్ తప్పుకున్నాడు..ఆ తర్వాత తన అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి దగ్గరగా వుంటూ వస్తున్నాడు.. 

తాజాగా అఖిల్ సార్థక్  తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసాడు. "కొంతమంది లైఫ్ లోకి వద్దన్న వస్తారు. మెసేజ్ చెయ్యకన్నా చేస్తారు. లవ్ యూ అంటారు. కానీ తర్వాత నథింగ్.. అక్కడ లవ్ లేదు బొంగు లేదు. దూరంగా ఉన్నప్పుడు అలా చెప్తారు. దగ్గర ఉంటే అదేం ఉండదు. ఇలాగే ఉంటారు. కలికాలం కదా ఏం చెయ్యలేం. ఆ దొరికేటోళ్లు కూడా నాకే దొరుకుతారు. వస్తారు పుల్ల పెడతారు, మంట వస్తది, దాన్ని ఆర్పకుండా పోతారు. ఇంకొకసారి లవ్వు గివ్వు అన్నావంటే కొవ్వుపై పెట్రోల్ పోస్తా.. నీ అవ్వ, నీ ఎంకమ్మ గుర్తు పెట్టుకో, నీకు ఇది ఎప్పటికి  గుర్తుండిపోయే రోజు" అని అఖిల్ సార్థక్ తన ఫ్రస్టేషన్ ని బయటకు చెప్పాడు. అయితే అఖిల్ సార్థక్ అన్న మాటలు మోనాల్ గజ్జర్ ని ఉద్దేశించి అన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అఖిల్ సార్థక్ ముందు పెట్టిన వీడియోలో మోనాల్ గజ్జర్ తో తన సంభాషణ ఉన్న వీడీయోని పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి క్లియర్ గా మోనాల్ గజ్జర్ ని ఉద్దేశించి తను మాట్లాడినట్టు అర్థం అవుతుంది.