English | Telugu
ఢీ షోకి తాగేసి వచ్చిన ఆది... షాకైనా శేఖర్ మాష్టర్
Updated : Jul 22, 2023
ఢీ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో తీసుకున్న కాన్సెప్ట్స్ చాలా వెరైటీగా మంచి ఫన్నీగా ఒక షార్ట్ స్టోరీని ఒక డాన్స్ రూపంలో చెప్పినట్టుగా ఉన్నాయి. ఇందులో ముందుగా కింగ్స్ ఆఫ్ కరీంనగర్ వెర్సెస్ వాల్తేరు వారియర్స్ పోటీ పడ్డారు. ఇక ఈ షోకి దీపికా పిల్లి అఖిల్ సార్థక్ ని తీసుకొచ్చింది. "ఎవడీడు" అని ప్రదీప్ అడిగేసరికి "మా బావ" అని చెప్పింది దీపికా.." ఆ డ్యాన్సింగ్ స్టయిలు, ఆ బాడీ లాంగ్వేజ్ ఏమీ లేకపోయినా బావ అన్నావ్ కాబట్టి " అని ప్రదీప్ అన్నాడు. "ఇంకొకాయన ఏడీ" అని శేఖర్ మాష్టర్ అడిగేసరికి హైపర్ ఆది మందు బాటిల్ చేతిలో పట్టుకుని తాగుతూ వచ్చాడు.
"ఈ సెట్ లోకి మందు తాగుతూ వస్తావా నువ్వు " అని అడిగేసరికి "నీ ప్రాబ్లమ్ ఏమిటి శేఖర్ " అన్నాడు ఆది.. దానికి షాకైనా శేఖర్ మాష్టర్ "ఫస్ట్ టైం తాగినట్టు ఉన్నాడు కదా అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నట్టు ఉన్నాడు" అన్నారు శేఖర్ మాష్టర్. "ఎవడికోయ్ ఫస్ట్ టైం...5 సీజన్ ల నుంచి తాగుతున్నాను..గుట్టు తెలుసా నీకు" అన్నాడు ఫన్నీగా ఆది.
తర్వాత బెజవాడ టైగర్స్ వెర్సెస్ కోనసీమ పందెంకోళ్లు మధ్య డాన్స్ ఫైట్ జరిగింది. వీళ్ళు రీసెంట్ గా జరిగిన ట్రైన్ ఆక్సిడెంట్ ఇష్యూ మీద డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ ఆక్సిడెంట్ ని బతికి బయటపడిన ఒక తల్లీ కొడుకుని ఈ స్టేజి మీదకు తీసుకొచ్చారు ఈ షో మేకర్స్. "ట్రైన్ ఆక్సిడెంట్ జరిగిన టైంలో ఒక్కొక్కరిని చూస్తుంటే ఆ రక్తం ఆ శవాలు..ఒక భోగీ మొత్తం రక్తం ఐపోయింది. నేను మా అమ్మ ఆ దేవుడిని ఒక్కటే ప్రార్ధించాం..చావైతే అందరికీ రావాలి కానీ ఇలాంటి చావు కాదు " అని అనుకున్నాం అని చెప్పారు.