English | Telugu

Bigg boss 9 telugu: సుమన్ శెట్టికి అన్యాయం.. సంఛాలక్ గా ఫ్లోరా ఫెయిల్!

బిగ్ బాస్ సీజన్-9 లో ఐదో వారం క్రేజీగా సాగుతోంది. హౌస్ లో డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి టాస్క్ ల మీద టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే ఇందులో ఒకరిని మించి ఒకరు స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు.

సుమన్ శెట్టి, శ్రీజ ఒక టీమ్ గా ఉన్నారు. అయితే ప్రతీ టాస్క్ లో సుమన్ శెట్టి తన వంద శాతం ఎఫర్ట్స్ పెడుతుంటే శ్రీజ మాత్రం ఫెయిల్ అవుతుంది. తను టాస్క్ లని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణం. గొడవకి ముందుండే శ్రీజ ఆటల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు.. దాంతో సుమన్ శెట్టి టీమ్ వెనుకపడింది. కళ్యాణ్ గెలవాలని ఒక స్ట్రాటజీ ప్రకారం శ్రీజ సుమన్ శెట్టిని ఓడిస్తుందని అందరికి అర్థమవుతుంది. అయితే శ్రీజతో పాటుగా ఫ్లోరా కూడా అదే తప్పు చేసింది. నిన్నటి వాటర్ పూల్ టాస్క్ లో సుమన్ శెట్టి నీళ్ళలో పడుకొని ఉన్నాడు. అందులో నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల సుమన్ శెట్టి కాళ్ళు ఆ పూల్ కి తాకాయని ఫ్లోరా అనుకుంది. అయితే తన కాళ్ళు పూల్ ని తాకాయాని కన్ఫమ్ అయిన ఫ్లోరా సుమన్ శెట్టిని ఫస్ట్ ఎలిమినేట్ చేసింది. అయితే సుమన్ శెట్టి మాత్రం.. నా కాళ్ళు తాకలేదు.. నీళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల మీకు అలా కన్పిస్తుందని అన్నాడు. ఇక ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ వచ్చి సంఛాలక్ డెసిషన్ ఫైనల్ కదా అని చెప్పారు.

సంఛాలక్ డెసిషన్ ఫైనల్ కానీ తను సరిగ్గా చూడలేదు.. అసలు నేనెప్పుడైనా ఆర్గుమెంట్ చేశానా.. తనకి తెలియదు.. నేను చెప్తున్నాను కదా నా కాళ్ళు తాకలేదంటూ సుమన్ శెట్టి చెప్పాడు. అయితే అప్పటికే అందరు వాటర్ పూల్ ఉండటంతో సుమన్ శెట్టి అర్థం చేసుకొని టాస్క్ నుండి క్విట్ అయ్యాడు. పాపం ఫ్లోరా చేసిన మిస్టేక్ వల్ల సుమన్ శెట్టికి అన్యాయం జరిగింది. మరి ఈ టాస్క్ లో సంఛాలక్ ఫ్లోరా చేసింది కరెక్ట్ అని మీకనపిస్తుందా కామెంట్ చేయండి.