English | Telugu

Jayam serial : గంగపై రౌడీలు ఎటాక్.. రుద్ర కాపాడుతాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -81 లో.....గంగకి మణి తాళి కట్టబోతుంటే లక్ష్మీ కత్తిపీట తీసుకొని వచ్చి.. తనని వదిలి పెట్టమని మణి మెడపై పెడుతుంది. దాంతో గంగని వదిలిపెడతాడు. నీ భర్త నా దగ్గర డబ్బు తీసుకున్నాడు.. అవి ఇచ్చేయండి అని లక్ష్మీని మణి అడుగుతాడు. ఒక ఆరు లక్షల వరకు రావాలి డబ్బు అయిన ఇవ్వండి.. లేక గంగని అయినా పెళ్లి చేసుకుంటానని మణి అంటాడు. నీ డబ్బు నీకు మూడు నెలల్లో ఇచ్చేస్తాను లేదంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని మణికి గంగ చెప్తుంది.

దానికి సంబంధించి మణి అగ్రిమెంట్ రాయించుకుంటాడు. అంత డబ్బు ఎలా ఇస్తావని గంగని లక్ష్మీ అడుగుతుంది. గంగ సైలెంట్ గా వెళ్లిపోతుంది. మరొకవైపు గంగపై హత్య ప్రయత్నం చేసినట్టు రుద్రకి కల వస్తుంది. దాంతో లేచి బయటకు వచ్చి గంగ గురించి తన చెల్లి స్నేహాని అడుగుతాడు. గంగ ఎక్కడ ఉండదు.. ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని అందరికి అర్థమవుతుంది. మీరు అలా తిట్టినప్పుడు ఎలా ఉంటుంది.. అసలే ఆత్మగౌరవం కలిగిన పిల్ల.. తనకి సపోర్ట్ గా మాట్లాడాలనుకున్నా కానీ మీ పెద్దమ్మ అనుకుటుంది. నిజం అనుకుంటుందని సైలెంట్ గా ఉన్నానని పెద్దసారు అంటాడు. అప్పుడే రుద్రకి స్టేషన్ నుండి ఇన్‌స్పెక్టర్ కాల్ చేసి సైదులు స్టేషన్ నుండి తప్పించుకున్నాడు. జాగ్రత్తగా ఉండమని చెప్తాడు.

మరొకవైపు లక్ష్మీ పసుపు, కుంకుమ పట్టుకొని వెళ్తుంటే.. పైడిరాజు ఎదురు వచ్చి అవి కిందపడేలా చేస్తాడు. దాంతో లక్ష్మీ కోప్పడుతుంది. గంగ గిన్నెలు తోముతుంది. అప్పుడే రుద్ర వచ్చి గంగపై హత్యాప్రయత్నం చేసిన అతను తప్పించుకున్నాడంట. గంగ నా బాధ్యత అందుకే తనని తీసుకొని వెళ్తున్నానని గంగ చెయ్ పట్టుకొని పసుపు, కుంకుమ పడ్డ చోటు నుండి తీసుకొని వెళ్తాడు. తరువాయి భాగంలో గంగ వాటర్ క్యాన్ మోస్తుంటే.. రౌడీలు తనని ఎటాక్ చెయ్యాలని చూస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.