English | Telugu

Bigg Boss 9 Telugu: డ్యాన్స్ తో ఇరగదీసిన సుమన్ శెట్టి.. ఆటలో సంజనని ఓడించాడుగా!

బిగ్ బాస్ సీజన్-9 లో ప్రస్తుతం టాస్క్ ల పరంపర సాగుతుంది. ఎవ్వరు తగ్గటం లేదు.. ఎందుకంటే డూ ఆర్ డై సిచువేషన్ ఉంది. ఎందుకంటే ఈ వీకెండ్ లో వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాంతో హౌస్ లీస్ట్ లో ఉన్నవారు ఎలిమినేషన్ అవుతారు. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అయితే గేమ్ లలో ఎవరు బాగా ఆడి టేబుల్ లో టాప్ లో ఉంటారో వాళ్ళు సేఫ్.. కానీ లీస్ట్ లో ఉన్నవాళ్ళు డేంజర్ జోన్ .

ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లోకి వెళ్లే సమయం వచ్చింది. అయితే ఎంటర్‌టైన్ అవ్వడం ఎంత ముఖ్యమో టాస్కులో గెలవడం కూడా అంతే ముఖ్యం. మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకి ఉన్న కలర్ హోల్స్‌లో నేను చెప్పిన కలర్ హోల్ నుంచి బయటికి రావాలి. ఏ జట్టు సభ్యులైతే ఎక్కువసార్లు ముందుగా బయటికొస్తారో వాళ్లు ఈ టాస్కులో విజేతలు అవుతారంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక సాంగ్​ మొదలవగానే సుమన్ శెట్టి అద్దిరిపోయేలా స్టెప్పులేశాడు. మిగిలిన అమ్మాయిలతో కలిసి సుమన్ శెట్టి వేసిన డ్యాన్స్ చూసి అందరూ తెగ నవ్వుకున్నారు. నాది నక్లెస్ గొలుసు పాటకి సుమన్ శెట్టి, సంజనా గల్రానీ చేసిన డ్యాన్స్ నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది.

ఇంతలో మ్యూజిక్ స్టాప్ చేసి ఆరెంజ్ కలర్ అని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో అందరికంటే ముందు దివ్య ఆ హోల్​లో దూరింది. వెనకాల నుంచి మిగిలిన వాళ్లు లాగినా సరే బయటపడి గెలిచింది దివ్య. అలా ఈ గేమ్ మూడు సార్లు జరిగింది. మూడో రౌండ్ లో సుమన్ శెట్టి-సంజనా ఉండగా.. సుమన్ శెట్టి చిరుత వేగంతో వచ్చి హోల్ నుండి బయటకి వచ్చేశాడు. దాంతో సుమన్ శెట్టి టీమ్ గెలిచింది. సంజనా టీమ్ ఓడిపోయింది. ఇలా నిన్నటి టాస్క్ లో భరణి-దివ్యలతో పాటుగా సుమన్ శెట్టి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చేశాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.