English | Telugu

జ‌బ్ వి మెట్ కిచ్‌డీ అంటున్న హాట్ బ్యూటీ!

అబ్బా... జ‌బ్ వి మెట్ కిచ్‌డీ. ఎప్పుడూ దాన్నే ఎందుకు గుర్తు చేస్తారు?  నేను న‌టించిన చ‌మేలీ, ఓంకారా ఎందుకు గుర్తురావు మీకు అని త‌ల‌ప‌ట్టుకుంటున్నారు హాట్ బ్యూటీ క‌రీనాక‌పూర్‌. క‌బీ ఖుషి క‌బీ గ‌మ్‌, జ‌బ్ వి మెట్‌లో తాను చేసిన పాత్ర‌ల గురించి జ‌నాలు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటార‌ని చ‌మేలి, హీరోయిన్ గురించి ఎందుకు ప్ర‌స్తావించ‌ర‌ని మండిప‌డ్డారు. బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీస్‌లో క‌రీనా ఒక‌రు. సాలిడ్ పెర్ఫార్మెన్సుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు జ‌నాల‌ను మెస్మ‌రైజ్ చేస్తూనే ఉంటారు క‌రీనా. బెబో రీసెంట్‌గా మాట్లాడుతూ ``నా కెరీర్‌లో బెస్ట్ కేర‌క్ట‌ర్లు అంటూ పూ, గీత్ గురించి ప్ర‌స్తావిస్తుంటారు. అవి బావుంటాయి. కానీ చ‌మేలీ, ఓంకారా, హీరోయిన్‌లో నేను చేసిన పెర్ఫార్మెన్స్ మ‌రో రేంజ్‌లో ఉంటుంది. వాటి గురించి కూడా మాట్లాడాలి క‌దా. నా దృష్టిలో జ‌బ్ వి మెట్ పెద్ద కిచ్‌డీ. ఇంట్లో కిచ్‌డీని ఎన్నిసార్లు తింటామో, అన్నిసార్లు జ‌బ్ వి మెట్‌ని చూస్తారు జ‌నాలు. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్ట‌ద‌ని చెబుతారు. నేను కూడా అప్పుడ‌ప్పుడూ చూసుకుంటాను`` అని అన్నారు.

ట‌బుతో ప‌నిచేయ‌డం గురించి మాట్లాడుతూ ``సినిమాలో అంద‌రూ అమ్మాయిలే ప‌నిచేస్తే అది సూప‌ర్ కూల్ థింగ్ నా దృష్టిలో. ఇప్పుడు టబుతో ప‌నిచేస్తున్నాను. ఇన్నాళ్ల‌ల్లో ఎప్పుడూ ఆమెతో ప‌నిచేయ‌లేదు. లోలో (క‌రిష్మా క‌పూర్‌), ట‌బు క‌లిసి చాలా మంచి ప్రాజెక్టులు చేశారు. ఈ సినిమాకు అంద‌రం అమ్మాయిలే ప‌నిచేస్తున్నాం. మా నిర్మాత‌లు రియా క‌పూర్‌, ఏక్తా క‌పూర్ కూడా చాలా స‌ర‌దాగా ఉంటారు. ఎప్పుడూ కొత్త‌గా ఏదో ఒక‌టి చేయాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. చేసి జ‌నాల‌ను మెప్పిస్తుంటారు. ఈ సినిమా ఓటీటీ కోసం అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఇది బిగ్ స్క్రీన్ సినిమా. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది`` అని అన్నారు.