Read more!

English | Telugu

ప్రేమా? కామ‌మా? ఏం కావాలంటున్న మిల్కీ బ్యూటీ!

వెబ్‌సీరీస్‌ల యాంథాల‌జీలో ల‌స్ట్ స్టోరీస్‌ది ఎప్పుడూ స్పెషల్ ప్లేస్‌. బోల్డ్ కంటెంట్‌ని అంత బోల్డ్ గా చెప్ప‌వ‌చ్చా అని అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తిన సీరీస్‌. ఫేడ‌వుట్ అయిన కొంద‌రు ఆర్టిస్టుల‌కు మ‌ళ్లీ ఛాన్సులు తెచ్చిపెట్టింది. కొంద‌రు అప్ క‌మింగ్ ఆర్టిస్టుల‌కు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. రాధికా ఆప్టే, కియారా అడ్వానీ ఎపిసోడ్స్ ని ఎవ‌రూ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు.  ఇప్పుడు ఈ సీరీస్‌కి సీక్వెల్ రెడీ అయింది. టీజ‌ర్‌ విడుద‌ల చేసింది నెట్‌ఫ్లిక్స్. ఇందులో ప‌లు ఎపిసోడ్స్ ఉన్న‌ప్ప‌టికీ, తెలుగువారికి అట్రాక్ట్ చేస్తున్న విష‌యాలు కొన్ని ఉన్నాయి. వాటిలో విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా ఎపిసోడ్ ఒక‌టి. ల‌స్ట్ సీరీస్‌2  నుంచే వారిద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త పెరిగింద‌ని అనేవారూ ఉన్నారు. అంత‌కు ముందే మ్యూచువ‌ల్ ఫ్రెండ్స్ ద్వారా వీళ్లు క‌లిశారు అనేవారూ ఉన్నారు. ప‌రిచ‌యం ఎలా జ‌రిగినా, ఈ ఎపిసోడ్‌లో వాళ్ల మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి మాత్రం ఇంట్ర‌స్టింగ్ డిస్క‌ష‌న్లే జ‌రుగుతున్నాయి.

దానికి తోడు ప్రేమ కావాలా?  కామం కావాలా? అని యూత్‌ని టీజ్‌చేస్తూ త‌మ‌న్నా టీజ‌ర్‌ షేర్ చేశారు. ఎవ‌రికి న‌చ్చిన రీతిలో వాళ్లు ఆమెకు స‌మాధానం ఇస్తున్నారు. వాహ‌నాలు కొనే ముందు టెస్ట్ డ్రైవ్ చేయ‌డానికి ప‌ర్మిష‌న్ ఇస్తారు. మ‌రి పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్ ఎందుకు టెస్ట్ డ్రైవ్ ఉండ‌దు? అని బామ్మ అడిగే ప్ర‌శ్న‌తో ల‌స్ట్ స్టోరీస్ మొద‌ల‌వుతుంది ఈ టీజ‌ర్‌. కాజోల్‌, మృణాల్ కూడా ప్రామినెంట్ రోల్స్ చేసిన‌ట్టు అర్థ‌మ‌వుతుంది. త‌మ‌న్నా లుక్స్ మాత్రం అదుర్స్ అంటూ రెచ్చిపోతున్నారు ఫ్యాన్స్.  ఈ నెల 29 నుంచి ప్ర‌సారం కానుంది ల‌స్ట్ స్టోరీస్‌2. సీతారామ‌మ్ సినిమాలో ప‌ద్ధ‌తిగా క‌నిపించినా, సోష‌ల్ మీడియా న‌చ్చిన‌ట్టు రెచ్చిపోతున్న మృణాల్ ఠాకూర్ ఈ సీరీస్‌లో ఇంకెంత హాట్‌గా క‌నిపిస్తారోన‌నే ఆత్రుత యంగ్‌స్ట‌ర్స్ లో క‌నిపిస్తోంది.