English | Telugu
ఛత్రపతి శివాజీ పాత్రలో ఆకాష్!
Updated : Jun 6, 2023
ఛత్రపతి శివాజీ మహరాజ్ కథతో తెరకెక్కనున్న సినిమా బాల్ శివాజీ. ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించడానికి సెలక్ట్ అయ్యారు సైరాట్ ఫేమ్ ఆకాష్ తోషర్. ఎక్స్ పెన్సివ్ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. మరాఠా రూలర్ శివాజీ యవ్వనానికి సంబంధించిన కథ ఇది. 12 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు ఆయన ఎలా ఉండేవారు? ఆయన్ని తల్లిదండ్రులు ఎలా పెంచారు? ఆయనలో స్కిల్స్ ఎలా డెవలప్ అయ్యాయి? ఆలోచనా విధానంఎలా ఉండేది? వంటి అంశాలతో బాల్ శివాజీని తెరకెక్కించనున్నారు. దర్శకుడు రవి జాదవ్ మాట్లాడుతూ ``నా కథ మొత్తం శివాజీ పెంపకం మీద ఉంటుంది. శివాజీని ఆయన తల్లిదండ్రులు జిజామాతా, షహాజీ రాజే భోంస్లే ఎంత బాగా పెంచారనేది తెరకెక్కిస్తాను. ఒక వారియర్‌ని, ఒక రూలర్‌ని వాళ్లు పెంచిన విధానం పలువురు తల్లిదండ్రులకు స్ఫూర్తిదాయకం. తొమ్మిదేళ్లు ఈ స్క్రిప్ట్ మీద పనిచేశాను. నా విజన్‌ని స్క్రీన్ మీదకు తీసుకుని రావడానికి సంతోషిస్తున్నాను. హిస్టారికల్ సినిమా చేయడం నాకు ఇదే తొలిసారి. ఆకాష్ తోషర్ ని సెలక్ట్ చేసుకున్నాం. సంపూర్ణమైన న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది.
రీగల్ లుక్, మంచి పర్సనాలిటీ ఉంది. యంగ్ కింగ్‌గా అద్భుతంగా కనిపిస్తాడు. ఈ రోల్ పట్ల అతను చూపిస్తున్న ఆసక్తి నాకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తోంది`` అని అన్నారు. ``అద్భుతమైన విజువల్స్ అందించే యుగంలో ఉన్నాం. అందుకే గొప్ప గొప్ప కథలన్నీ తెరమీద పురుడుపోసుకుంటున్నాయి. దేశంలోని అన్నీ ప్రాంతాల వారికి చరిత్రను గుర్తుచేసేలా తెరకెక్కిస్తాం. వైడ్ యూనివర్శల్ అప్పీల్ ఉన్న సినిమా ఇది. రవిజాదవ్ చెప్పిన కథ అద్భుతంగా ఉంది`` అని నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ వ్యాస్ అన్నారు. బాల్ శివాజీని సందీప్ సింగ్, సామ్ ఖాన్, రవి జాదవ్, విశాల్ గుర్నాని, జుహి ఫరేఖ్ మెహతా, అభిషేక్ వ్యాస్ నిర్మిస్తున్నారు. లెజండ్ స్టూడియోస్, ఏవీయస్ స్టూడియోస్, రవిజాదవ్ ఫిల్మ్స్ సంస్థలపై నిర్మితమవుతోంది. రవిజాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది.
