English | Telugu
కంగన ఆ టైప్ కాదంటున్న మాధవన్
Updated : Jun 7, 2023
హీరో చుట్టూ తిరిగి, నాలుగు పాటలు పాడి, నాలుగు మాటలు చెప్పి, అతను కొడితే కొట్టించుకుని అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయే పాత్రల్లో కంగనను చూడలేం. అసలు ఆమె ఆ టైప్ ఆర్టిస్ట్ కానే కాదు అని అంటున్నారు మాధవన్. కంగనలాంటి అమ్మాయిలు సెలక్ట్ చేసుకునే రోల్స్ రేంజే వేరే స్థాయిలో ఉంటుందని చెప్పారు మాధవన్. తను వెడ్స్ మను, తను వెడ్స్ మను సీక్వెల్‌లో కలిసి నటించారు కంగన అండ్ మాధవన్. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో తమిళ్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. సక్సెస్‌ఫుల్ కాంబో ఈజ్ బ్యాక్ అంటూ కోలీవుడ్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే మేకర్స్ సినిమా గురించి అనౌన్స్ చేయబోతున్నారట. మాధవన్‌కి కంగన మీద అపారమైన గౌరవం ఉంది.
కంగన గురించి చెబుతూ ``కంగన సెలక్ట్ చేసుకునే పాత్రలను బట్టి ఆమె ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆమెఎంపిక చేసుకున్న కేరక్టర్ కోసం ఎంతో కృషి చేస్తుంది. ప్రాణం పెట్టి నటిస్తుంది. ఆమె మాత్రమే కాదు, నేను పనిచేసిన షాలినిగానీ, మిగిలిన హీరోయిన్లు అందరూగానీ అలాంటివారే. జీవితం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నవారే. వాళ్లను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది. చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. మా అమ్మ కూడా స్ట్రాంగ్ విమెన్. బీహార్‌లో 30 ఏళ్లు బ్యాంకులో పనిచేసిందంటే ఆమె గురించి అర్థం చేసుకోవచ్చు. అంత స్ట్రాంగ్‌గా ఉంటారు మహిళలు. ఎన్నో పనులను ఒంటి చేత్తో చక్కబెడుతారు. ఇళ్లల్లో గ్రాండ్ పేరెంట్స్ ని గమనించండి. బామ్మ మీద తాతయ్య ఆధారపడటాన్ని ఎక్కువగా చూస్తాం. అంతేగానీ, తాతయ్య మీద బామ్మ ఆధారపడ్డ సందర్భాలు అరుదుగానే ఉంటాయి. మన జీవితం మనకు నేర్పిన పాఠాలను అర్థం చేసుకోవాలి. మహిళలను గౌరవించాలి. కంగన మీద నాకు గౌరవం ఉంది`` అని అన్నారు.
