English | Telugu
ఇక నుంచి ఆటో కాదు టాటూ రాంప్రసాద్ ...
Updated : Oct 14, 2025
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇక ఇందులో రాంప్రసాద్ స్కిట్ వేరే రేంజ్ లో కొత్తగా ఉంది. ఆటో రాంప్రసాద్ పేరు కాస్త ఇప్పుడు టాటూ రాంప్రసాద్ గా మారిపోయింది. ఈ స్కిట్ లో టాటూ వేసి దొరబాబు. "ఇంతకు ముందు అంతా ఆటో రామ్ అనేవాళ్ళు ఈ షాప్ పెట్టిన దగ్గర నుంచి టాటూ రామ్ అంటున్నారు" అంటూ రాంప్రసాద్ చెప్పుకున్నాడు. "మా దగ్గర ఒకసారి వేయించుకుంటే ఇంకోసారి ఫ్రీగా వేస్తాం" అంటూ చెప్పాడు దొరబాబు. ఇంతలో చలాకి చంటి తన వైఫ్ ని తెచ్చి "నా భార్య బొడ్డు మీద నీ పేరు రాయడమేంట్రా" అని అడిగాడు. మాములుగా టాటూ వేస్తుంటే నాకు కనెక్ట్ అయిందేమో అనుకుని నా పేరు వేసేసా అని చెప్పి దొరబాబు అందరినీ నవ్వించాడు.
ఇంతలో శాంతి వచ్చి "మెడ మీద మొదలుకుని ఒళ్ళంతా పాము చుట్టుకుని బొడ్డు దగ్గరకొచ్చి కాటేయాలి" అంటూ టాటూ ఎలా వేయాలో చెప్పింది. దానికి దొరబాబు "ముందు కాటేస్తాను తర్వాత పాము వేస్తాను" అనేసరికి అందరూ పగలబడి నవ్వారు. మళ్ళీ చలాకి చంటి వచ్చి "మా ఆవిడ ఎం వేయిమంది నువ్వు ఎం వేసావ్" అని అడిగాడు. "పుట్ట వేసాను. పాము పుట్టలోకి వెళ్ళిపోయినట్టుంది" అని చెప్పాడు దొరబాబు. జడ్జ్ గా వచ్చిన శ్రీదేవి ఐతే అదే పనిగా నవ్వుతూ స్కిట్ ని ఎంజాయ్ చేసింది. తర్వాత రింగ్ రియాజ్, కొమరక్కా, నూకరాజు, వర్ష చేసిన బ్యాంకు లోన్, బర్రెల స్కిట్ కూడా ఫుల్ కామెడీగా ఉంది. ఇక రాకింగ్ రాకేష్, ప్రవీణ్ స్కిట్ కూడా బాగా నవ్వు తెప్పించింది. ఇందులో ప్రవీణ్ లేడీ గెటప్ వేసుకొచ్చి నవ్వించాడు.