English | Telugu

Bigg Boss 9 Telugu Srija Dammu : శ్రీజ రీఎంట్రీ కన్ఫమ్.. బిగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్-9 లో‌ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరుగుతున్నాయి. ‌అయిదు వారాల దాకా ఒక లెక్క.. ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా సాగుతోంది. గత వారం ఫ్లోరా సైనీ,‌ శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇందులో ఫ్లోరా సైనీ జనాల ఓటింగ్ తో బయటకు వచ్చేసింది. కానీ‌ శ్రీజని వైల్డ్ కార్డ్స్ నిర్ణయంతో ఎలిమినేషన్ చేసారు. ఇది క్లియర్ గా అన్ ఫెయిర్ అని జనాలు ఫైర్ అవుతున్నారు.

ఎలిమినేషన్ లో ఫ్లోరా సైనీ, రీతూ చౌదరి లీస్ట్ లో.. మొదటగా ఫ్లోరాని ఎలిమినేషన్ చేసారు. కానీ డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా రెండో ఎలిమినేషన్ లో‌ రీతూని చేయాల్సి ఉండగా రీతూ-డీమాన్ పవన్ ల లవ్ ట్రాక్ పోతుందని తనని ఎలిమినేషన్ చేయకుండా ఆపారు. ఇది క్లియర్ గా కంటెంట్ కోసం బిగ్ బాస్ స్ట్రేటజీ అని తెలుస్తోంది. అయితే ఆడియన్స్ మాత్రం దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓట్లు వేసే మేము‌ పిచ్చోళ్ళమా అంటూ రోడ్ల మీదకొచ్చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట ధర్నాకి దిగారు. అక్కడి సెక్యూరిటీ గార్డ్ తో రూడ్ గా ప్రవర్తించారని తెలుస్తోంది. ‌అయితే బిగ్‌ బాస్ టీమ్ దీని గురించి పాజిటివ్ గా స్పందించిందని తెలుస్తుంది. శ్రీజని ఈ వారంలో హౌస్ లోకి రీఎంట్రీ చూపిస్తారని తెలుస్తుంది.

రివ్యూయర్ ఆదిరెడ్డి, శ్రీను65 లతో పాటు మరికొంత మంది ‌యూట్యూబర్స్ కూడా శ్రీజ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని తనని మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చేదాకా మా పోరాటం ఆగదంటు తమ వీడియోలలో చెప్పుకొచ్చారు. అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చాక రోజుకో కొత్త గొడవ జరుగుతుంది. ‌అందులోను‌ దువ్వాడ మాధురి నామినేషన్ ఎక్కువగా ఉండటంతో పాత కంటెస్టెంట్స్ తనతో మాట్లాడటానికే భయపడుతున్నారు. అదే శ్రీజ ఉంటే మాధురికి సరైన సమాధానమిచ్చేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయేషా, నిఖిల్ ఇద్దరు కాస్త బాగానే మాట్లాడినా.. మాధురి, రమ్య మోక్షల మాటతీరు మాత్రం కావాలని గొడవ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరు కంటెంట్ కోసమే ఇలా చేస్తున్నారంటు ఇన్ స్టాగ్రామ్ లో‌ ట్రోల్స్ మొదలయ్యాయి. ‌మరి వీరికి సరైన గుణపాఠం చెప్పడానికి బిగ్‌బాస్ యాజమాన్యం దమ్ము శ్రీజని హౌస్ లోకి తీసుకొస్తుందా.. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.