English | Telugu

Karthika Deepam2: భర్త గౌరవం కాపాడలేని భార్య ఎందుకంటూ దశరథ్ ఎమోషనల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -488 లో.. జ్యోత్స్న ఇంటికి వెళ్లి అందరిని పిలుస్తుంది. మమ్మీ డాడీ మీరు ఇలా ఉండకండి ఎప్పటిలాగే ఉండండి .. ఎవరో ఒక అనాధకి పెళ్లి చేసి మీరు దూరంగా ఉండడం ఏంటి అని జ్యోత్స్న అంటుంది. నేను క్షమించలేనని దశరథ్ అంటాడు. మీ అమ్మ తప్పు చేసింది. ఆ తప్పుకి క్షమాపణ కూడా తెలుసు, అయినా చెయ్యడం లేదని దశరథ్ అంటాడు.

మీరు ఆగండి మావయ్య అని కార్తీక్ అంటాడు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని జ్యోత్స్న అనగానే.. వాడు కూడా ఈ ఇంటి వాడే.. నా కూతురు కొడుకు అని శివన్నారాయణ అంటాడు. మీరందరు ఒకటి.. మా అమ్మకి సపోర్ట్ ఎవరు లేరని జ్యోత్స్న అంటుంది. మీ అమ్మ తప్పు చేసిన రోజే నా మనసు సచ్చిపోయింది.. రెండోసారి తప్పు చేసినప్పుడు నేనెందుకు ఉన్నాను.. ఆ బుల్లెట్ తగిలిన రోజే చచ్చిపోతే బాగుండేదనిపించిందని దశరథ్ అనగానే సుమిత్ర షాక్ అవుతుంది. దశరథ్ పై శివన్నారాయణ కోప్పడతాడు. భార్యంటే భర్త గౌరవం కాపాడాలి కానీ నాకు ఆ గౌరవం లేదని దశరథ్ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న వల్లే ఇదంతా అని కార్తీక్ కోపంగా ఇంటికి వెళ్తాడు. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. తప్పు చేస్తున్నావ్ జ్యోత్స్న అని పారిజాతం అంటుంది. అంతా మన మంచికే అని జ్యోత్స్న అంటుంది.

ఆ తర్వాత నేను ఉండడం వల్ల ఆయన సంతోషంగా లేడని సుమిత్ర ఇంట్లో నుండి బయటకు వెళ్తుంది. అది జ్యోత్స్న చూసి సైలెంట్ గా ఉంటుంది. ఎవరో బయటకు వెళ్లారని పారిజాతం అంటుంది. ఎవరు లేరని జ్యోత్స్న చెప్తుంది. మరొకవైపు కార్తీక్ ఇంటికి వెళ్లి దీపకి జరిగింది మొత్తం చెప్తాడు. మరుసటి రోజు అనసూయ తన మరదలు అయిన అంబుజవల్లి ఫోటో తీసుకొని వచ్చి దీపకి ఇస్తుంది. ఎవరు ఆమె అని శౌర్య అడుగుతుంది. దీపని పెంచిన అమ్మ అని అనసూయ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.