English | Telugu
రొమాంటిక్ ఆంధ్ర మగాడు..ఇది ఫ్యామిలీ షోనే కదా...
Updated : Oct 14, 2025
జయమ్ము నిశ్చయమ్మురా ప్రతీ వారం లాగే ఈ వారం కూడా కలర్ ఫుల్ ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ కి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రాబోతున్నాడు. ఆర్ ఏ ఎం అంటే రామ్ కాదు రొమాంటిక్ ఆంధ్ర మగాడు అంటూ సరికొత్త నిర్వచనంతో జగపతి బాబు రామ్ ని ఇన్వైట్ చేశారు. "హౌ ఓల్డ్ ఆర్ యు" అనేసరికి 11 అన్నాడు రామ్. "14 ఐనా పర్లేదు మీసాలు పెంచేయి అన్నారు" అంటూ రామ్ అన్నాడు. "పెరిగాయా అప్పుడు మీసాలు వచ్చేసాయా" అంటూ అనుమానంగా అడిగారు జగపతి బాబు. "మరి తెలంగాణా క్వీన్ ఎవరు" అంటూ అడిగారు జగ్గు భాయ్. "నేను అలా డైవర్ట్ చేద్దామని చూస్తున్నా" అన్నాడు రామ్. "రొమాన్స్ ఎలా ఫిట్ అవుతుంది నీ లైఫ్ లో " అని జగ్గు భాయ్ అడిగారు.
"న్యాచురల్ కాలమిటీస్ అన్నీ మనం అనుకుంటే రావు వచ్చేస్తాయి అవన్నీ వచ్చాక ఓహ్ ఐపోయిందా అనుకుంటాం..అది కూడా 6 వరకే" అన్నాడు రామ్. "ఏది మార్నింగ్ 6 ఆ" అని జగ్గు భాయ్ డౌట్ ఎక్స్ప్రెస్ చేసేసరికి ఫ్యామిలీ షోనే కదండీ ఇది..ఫ్యామిలీ హీరో" అంటూ జగ్గు భాయ్ ని చూపించి నవ్వేసాడు రామ్. "గుర్తుపెట్టుకోండి ఎటకారం తన ఇంటి పేరు" అంటూ రామ్ మీద మరో సెటైర్ వేశారు జగ్గు భాయ్. టాలీవుడ్ లో రామ్ పోతినేని క్రేజ్ అంతా ఇంతా కాదు. త్వరలో ఆడియన్స్ ముందుకు "ఆంధ్ర కింగ్ తాలూకా" పేరుతో సరికొత్త మూవీతో రాబోతున్నాడు. దేవదాస్ మూవీతో టాలీవుడ్ లో హిట్ కొట్టి తర్వాత జగడం, రెడీ, ఒంగోలు గిత్త, ఎందుకంటే ప్రేమంట, ఇష్మార్ట్ శంకర్, కందిరీగ, రెడ్, వారియర్, స్కంద వంటి మూవీస్ లో నటించాడు. కొన్ని హిట్ అయ్యాయి కొన్ని ఫట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు మరో మంచి బ్రేక్ ఇచ్చే మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు రామ్.