English | Telugu

Bigg Boss 9 Telugu Nominations:  రీతూ చౌదరి చెత్త నామినేషన్.. దివ్యని నామినేషన్ చేసిన మాధురి!

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇక కొత్తగా హౌస్ లోకి వెల్డ్ కార్డ్స్ రావడంతో పాత కంటెస్టెంట్స్ కి దడ మొదలైంది. అయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అలాగే వైల్డ్ కార్డ్ గా వచ్చిన కంటెస్టెంట్స్ బిహేవ్ చేస్తున్నారు. నిన్నటి నామినేషన్ ప్రక్రియలో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.

మొదటగా బాల్ ని దువ్వాడ మాధురి దక్కించుకొని రీతూ చౌదరికి ఇచ్చింది. ఇక తనేమో భరణిని నామినేట్ చేసింది. నిజానికి భరణిని నామినేట్ చేస్తానని రీతూ ముందు చెప్పింది కనుకే మాధురి తనకి బాల్ ఇచ్చింది. నాకు మీరు కెప్టెన్సీ టాస్కులో సపోర్ట్ చేయలేదు.. మీరు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి కూడా చేయలేదు.. మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది.. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి.. ఇలా చేస్తే ఎలా అని రీతూ మాట్లాడింది. నేను నీ ఒక్కదానికే మాట ఇవ్వలేదు.. రాముకి కూడా ఇచ్చాను. కనుక నీ కంటే రాము ఎక్కువ అనిపించి తనకి సపోర్ట్ చేశానంటూ భరణి డిఫెండ్ చేసుకున్నాడు. ఇక తన రెండో నామినేషన్ గా దివ్యని చేసింది రీతూ. నాకు ఈరోజు టిఫిన్ టైమ్‌కి దొరకలేదు.. దాని వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది నీరసం వచ్చి కళ్లు తిరిగాయ్.. నువ్వు రేషన్ మానిటర్ కాబట్టి నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయిందని.. నువ్వే రీజన్ అని నామినేట్ చేస్తున్నానంటూ రీతూ చెప్పింది. దోస కోసం నన్ను నువ్వు నామినేట్ చేస్తున్నావా అని దివ్య కామెడీ చేసింది. నీకు అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ నాకు పెద్ద ఇష్యూ అంటూ రీతూ అంది.

అయితే ఈ రెండింటిలో ఒకరిని సేవ్ చేసి ఒక నామినేషన్ మాత్రమే సెలక్ట్ చేయాలి కాబట్టి నేను భరణిని సేవ్ చేస్తున్నాను.. దివ్యని నామినేట్ చేయాలనుకుంటున్నానంటూ మాధురి చెప్పింది. మేము హౌస్‌కి కొత్తగా వచ్చాం.. మీరు చాలా రోజులుగా ఉన్నారు.. మాకు కోఆపరేట్ చేయాలి.. మా మీద అరవకూడదని మాధురి చెప్పింది. అది మీ మాట తీరు బట్టి ఉంటుందండి.. మీరు అరిస్తే నేను అరుస్తానంటూ దివ్య అంది. సరే అరవండి.. ఏం పర్లేదు అరుచుకుందాం.. నాకు అయితే అది నచ్చలేదు.. హౌస్‌లో ఉన్నవాళ్ళందరూ మాతో ఇంటరాక్ట్ అయ్యారు.. కానీ మీరు ఎంతసేపు భరణిగారితో తప్ప ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వలేదని మాధురి అనగా.. నాకు మీతో అవ్వాలని కూడా లేదని ముఖం మీదే దివ్య చెప్పేసింది. సరే మీ ఇష్టం నేను చెప్తున్నాను మీ ఆన్సర్ నేను అడగలేదు కదా..ఇదిగో ఈ అటిట్యూడ్ కారణంగానే ఆమెని నామినేట్ చేస్తున్నాను.. అది అటిట్యూడ్ అంటూ మాధురి చెప్పేసింది‌. రీతూ చేసిన ఇన్ వ్యాలిడ్ రీజన్లు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..