English | Telugu
సోనాక్షి వాళ్ల నాన్న ఇచ్చిన అడ్వైజ్ ఏంటి?
Updated : Jun 7, 2023
నటి సోనాక్షి సిన్హా గురించి సౌత్ ఆడియన్స్ కి కూడా మంచి పరిచయమే ఉంది. ఆమె కెరీర్ బిగినింగ్‌లోనే మంచి మంచి సినిమాలతో ఆకట్టుకున్నారు. ``అది నా అదృష్టం. అంత మంచి కేరక్టర్లు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఆడియన్స్ నాకు ప్రేమను పంచారు. అలాంటి పాత్రలే మళ్లీ మళ్లీ వస్తే మాత్రం సారీ చెప్పేస్తున్నాను. అందుకే వరుసగా సినిమాలు రావడం లేదు`` అని అన్నారు సోనాక్షి. రీసెంట్‌గా ఆమె దహాద్ చేశారు. దాని గురించి మాట్లాడుతూ ``ప్రతి ఒక్కరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. నాక్కూడా అలాంటివి ఉన్నాయి. నా ఆడియన్స్ నన్ను స్ట్రాంగ్ రోల్స్ లో ఇష్టపడ్డారు. అలాంటి పాత్రల్లోనూ కొత్తదనం కోసం నేను వెతుకుతున్నాను. ఆ సమయంలో దహాద్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. నచ్చి వెంటనే చేసేశాను. కేరక్టర్ నచ్చితే వెంటనే కాల్షీట్ ఇచ్చేస్తున్నాను`` అని అన్నారు. సోనాక్షి బేసిగ్గా చాలా కూల్‌గా ఉంటారు. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడరు. దీని గురించి ప్రస్తావిస్తూ ``లొడ లొడ మాట్లాడితే మనకి ఏం తెలుసో, ఏం తెలియదో అవతలి వాళ్లు ఇట్టే పట్టేస్తారు. చిన్న విషయాలకు కుంగిపోకూడదు. దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. ఎవరు చేశారో చెప్పకుండానే అందరూ తెలుసుకోగలగాలి అని నాన్నచెప్పారు. అప్పటి నుంచి ఏం చేసినా అక్కడ నా ముద్ర ఉండేలా జాగ్రత్తపడుతున్నాను `` అని అన్నారు.
తన తల్లిదండ్రుల నుంచి తనకు వచ్చిన అలవాట్లు గురించి మాట్లాడుతూ ``మా అమ్మానాన్నల పోలికలు నాలో చాలా ఉన్నాయి. మానాన్నకి ధైర్యం ఎక్కువ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిబ్బరంగా ఉంటారు. నేను కూడా అంతే. చిన్నవాటికి బెదిరిపోయే లక్షణం నాలో లేదు. మా అమ్మలోని ఫెమినైన్ క్వాలిటీస్ అన్నీ నాలోనూ ఉన్నాయి. ఓ అమ్మాయిగా నేను ఎలా ఉండాలో మా అమ్మ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. ఇంత మంచి, సపోర్టింగ్ తల్లిదండ్రులు ఉన్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది`` అని అన్నారు. గుల్షన్ దేవయ్య, సోహమ్ షా, విజయ్ వర్మతో పాటు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. అత్యంత కిరాతకుడిగా పేరు తెచ్చుకున్న సీరియల్ కిల్లర్ సైనేడ్ మోహన్ కథను ఆధారంగా చేసుకుని దహాద్ కథను రాసుకున్నారు మేకర్స్.