English | Telugu

ప‌ర్వీన్‌బాబీ బ‌యోపిక్‌లో ఊర్వ‌శి!

ఊర్వ‌శి రౌతేలా చరిష్మా రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ ఏడాది సౌత్‌లోనే ఆమె ఇప్ప‌టికి నాలుగు సినిమాల‌తో జోరుమీదుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ ఆమెకు తెలుగులో మంచి ఊపు తెచ్చిపెట్టింది. ఏజెంట్‌లోనూ వైల్డ్ సాలాలో పెర్ఫార్మ్ చేసింది. రామ్ పోతినేని, బోయ‌పాటి సినిమాలోనూ ఊర్వ‌శి రౌతేలా ఓ సాంగ్ చేస్తోంది. బ్రో మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో స్టెప్పులు వేయ‌డానికి రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలోనే లెజండ‌రీ ఆర్టిస్ట్ ప‌ర్వీన్ బాబీ బ‌యోపిక్‌లో ఊర్వ‌శి అంటూ వార్త‌లొస్తున్నాయి. అయితే ఆ వార్త‌ల‌న్నీ బోగ‌స్ అనే విష‌యం కూడా ట్రెండ్ అయింది. అయితే, ఇప్పుడు రైట‌ర్ ధీర‌జ్ మిశ్రా అన్నీ అలిగేష‌న్స్‌కీ చెక్ పెట్టేశారు.

ఊర్వ‌శీ రౌతేలా ఆన్ బోర్డ్ అంటూ ప‌ర్వీన్ బాబీ బ‌యోపిక్ గురించి అనౌన్స్ చేశారు. ధీర‌జ్ మిశ్రా మాట్లాడుతూ ``ప‌ర్వీన్ బాబీ బ‌యోపిక్ చేస్తున్నాం. ర‌ఫ్ వ‌ర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు స్క్రీన్ ప్లే మీద ఫోక‌స్ పెట్టాం. వాసిమ్ ఖాన్ ఈ సినిమాకు నిర్మాత‌. నేను ఇంత‌కు ముందు  చాలా బ‌యోపిక్స్‌కి ప‌నిచేశాను. అందుకే న‌న్ను పిలిచి ఈ స్కిప్ట్ చేయ‌మ‌న్నారు. రీసెర్చ్ వ‌ర్క్ చేసిన‌ప్ప‌టి నుంచే చాలా క్యూరియ‌స్‌గా ఉంది. బిఆర్ ఇషారాతో మాట్లాడాను. ప‌ర్వీన్ బాబీని ఇంట్ర‌డ్యూస్ చేసిన వ్య‌క్తి త‌ను. ఆమె గురించి ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.

ఆమె బంధువుల‌ను కూడా మేం క‌లిశాం. సోనాక్షి సిన్హా, శ్ర‌ద్ధా క‌పూర్‌ని ఆమె రోల్‌కి  అనుకున్నాం. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఫైన‌ల్‌గా ఊర్వ‌శి రౌతేలాను ఫిక్స్ చేశాం. జ‌వానీ తేరి బిజిలి కీ తార్ హై అనే మ్యూజిక్ వీడియోలో ఊర్వ‌శిని చూడ‌గానే ప‌ర్ఫెక్ట్ అనిపించింది. వెంట‌నే నిర్మాత‌కు ఆమె పేరు చెప్పాను. ఇండ‌స్ట్రీలో పేరున్న వ్య‌క్తి అయి ఉండాలి. అలాగ‌ని బిగ్ స్టార్ వ‌ద్ద‌ని ముందే అనుకున్నాం. త‌న‌కంటూ ఓన్ స్టైల్ ఉండాల‌ని అనుకున్నాం. మేం అనుకున్న అన్ని క్వాలిటీస్ ఊర్వ‌శిలో ఉన్నాయి. మూవీ డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి`` అని అన్నారు.