English | Telugu
Brahamamudi: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదు.. భార్యపై భర్త ఆరోపణలు!
Updated : Nov 24, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -261 లో.... స్వప్న తన నగలు అమ్మి అరుణ్ కి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటుంది. కాసేపటికి నగలు అన్ని బ్యాగ్ లో పెట్టుకొని బయలుదేరుతుంది స్వప్న. మరొక వైపు స్వప్న నగలు సర్దుకోవడం చూసి.. ఇప్పుడు నిన్ను ఇంట్లో నుండి పంపించడానికి ఆఫీషియల్ గా ఛాన్స్ ఇచ్చావని రాహుల్ అనుకుంటాడు.
మరొక వైపు రాత్రి దొంగ కట్టిన కట్లు అలాగే ఉంచుకొని నిద్రపోయిన రాజ్, కావ్య ఇద్దరు నిద్రలేవగానే ఇబ్బంది పడుతారు.. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. అదేంటి అలా కట్లు కట్టుకున్నారని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య.. మీ అబ్బాయి గారే అని కావ్య అంటుంది.. ఆ తర్వాత ధాన్యలక్ష్మి కట్లు విప్పుతుంది. మరొక స్వప్న బ్యాగ్ తో వెళ్లడం చూసిన రుద్రాణి.. ఎక్కడికి వెళ్తున్నావ్? ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతుంది. పార్లర్ కి వెళ్తున్నాను క్రీమ్స్ అన్ని అయిపొయాయి మళ్ళీ తెచ్చుకోవాలి కదా అందుకే ఈ బ్యాగ్ అని రుద్రాణితో చెప్పి స్వప్న కంగారుగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్వప్న ఎంత ఈజీగా అబద్ధం చెప్తుందోనని రుద్రాణితో రాహుల్ అనగానే.. అది ఏం చేస్తే మనకేంటి అది అరుణ్ కి డబ్బులు ఇచ్చేటప్పుడు ఫొటోస్ కావాలని అరుణ్ కి చెప్పమని రాహుల్ తో చెప్తుంది. మరొకవైపు కృష్ణమూర్తి కుటుంబం టిఫిన్ చేస్తూ.. అప్పుకి ప్రేమగా తినిపిస్తు మాట్లాడతాడు. నువ్వు చేసింది తప్పని నేను అనడం లేదు. ఆ అబ్బయికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోయే ప్రయత్నం చేయమని ప్రేమగా అప్పుకీ చెప్తాడు కృష్ణమూర్తి. మరొక వైపు దుగ్గిరాల కుటుంబంలో.. కావ్య టిఫిన్ తీసుకొని వచ్చి రాజ్ ని అటపట్టిస్తుంది.
మరొక వైపు అరుణ్ ని స్వప్న కలిసి డబ్బులు ఇస్తుంది. ఇంకొకసారి ఇలా చెయ్యకంటూ అరుణ్ కి స్వప్న వార్నింగ్ ఇస్తుంది. మరొక వైపు ఇదంతా చేస్తుంది మనమేనని స్వప్నకి అరుణ్ చెప్తే పరిస్థితి ఏంటని రాహుల్ తో రుద్రాణి అంటుంది. అప్పుడే రాహుల్ ఫోన్ కి అరుణ్ ఫోన్ కి స్వప్న డబ్బులు ఇస్తున్న ఫొటోస్ ని పంపిస్తాడు. ఆ ఫొటోస్ రుద్రాణికి రాహుల్ చూపిస్తాడు. దీంతో స్వప్న ఒక తిరుగుబోతుదని ఇంట్లో నుండి పంపిస్తానని రాహుల్ తో రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో.. స్వప్నని రుద్రాణి.. ఇంట్లో నుండి గెంటేయబోతుంటే కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. దాంతో డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది.. గుడ్ న్యూస్ స్వప్న ప్రెగ్నెంట్ అని చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఆ బిడ్డకి తండ్రిని నేను కాదు. తన బాయ్ ఫ్రెండ్ వల్లే ఆ కడుపు వచ్చిందని రాహుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.