English | Telugu

హత్యలు చేస్తున్న శివాజీ...జైలుకెళ్ళిన రతిక!

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం టాస్క్ జరుగుతుంది. ఇందులో బిగ్ బాస్ భార్య హత్యకు గురైంది. బిగ్ బాస్ భార్యని హత్య చేసిన మర్డరర్ ఎవరో కనిపెట్టమని కంటెస్టెంట్స్ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్.

ఇప్పటికే ఉల్టా పల్టా ట్విస్ట్ లతో కంటెస్టెంట్స్ చేత ఒక ఆట ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. అయితే హౌస్ లో పది మంది ఉండగా అందులో శివాజీ ఒక్కడే తెలివితేటలతో, స్ట్రాటజీతో గెలుస్తున్నాడు. ఇక హౌస్ లోని వారికి ఒక్కో రోల్ ఇచ్చి ఆ పాత్రకి తగ్గట్టు చేయమని బిగ్ బాస్ కోరాడు. శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం హౌస్‌లో ఉన్న వాళ్లని ఒక్కొక్కర్నీ మర్డర్ చేస్తూ రావాలి. అయితే ఈ టాస్క్ లో మొదటగా పల్లవి ప్రశాంత్ ని స్టోర్ రూమ్ లో ఉండమన్నాడు శివాజీ. ఆ తర్వాత ప్రశాంత్ మొక్కను తీసుకొని పోస్ట్ బాక్స్ లో పెట్టి‌న శివాజీ సీక్రెట్ టాస్క్ ని గెలిచాడు. ఇలా టాస్క్ లో ప్రశాంత్ ని హత్య చేసిన శివాజీ మొదటి టాస్క్ లో విజేతగా నిలిచాడు.

అమర్ దీప్ , అంబటి అర్జున్ పోలీసులుగా ఉండి.. ఒక్కోక్కరి ఇంటరాగేషన్ చేసి హంతకులెవరో కనిపెట్టారు. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందని బిగ్ బాస్ పోలీసులైన అంబటి అర్జున్ , అమర్ దీప్ లని అడుగగా .. రతిక అని వాళ్లు చెప్పడంతో రతికని జైల్లోకి తీసుకెళ్ళారు పోలీసులు.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.