English | Telugu

రతికకు గట్టిగా ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. షాకైన గౌతమ్!

వాడిని అనవసరంగా వదిలేసారురా.. మడతబెట్టాల్సింది. ఇది గౌతమ్ కృష్ణతో అంబటి అర్జున్ అన్న మాట. హౌస్ లోకి వచ్చేకంటే ముందే అందరి ఆట చూసి గట్టిగ ప్లాన్ చేసుకొని వచ్చాడు అంబటి అర్జున్. అందుకే హౌస్ లోకి వచ్చిన నుండి కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. మొదటి వారం అమర్ దీప్ ని నామినేట్ చేసి సీరియల్ బ్యాచ్ కి వ్యతిరేకం అన్నట్టు కలరింగ్ ఇచ్చి.. ఇక హౌస్ లో కొన్ని వారాలే మిగిలిందని శివాజీ, ప్రశాంత్, యావర్ లని టార్గెట్ చేశాడు అంబటి అర్జున్. ఇక ప్రతీవారం వీళ్ళ ముగ్గిరినే టార్గెట్ చేస్తూ గౌతమ్ కృష్ణకి లేనిపోనివి కల్పించి చెప్పి అతని మైండ్ ని పొల్యూట్ చేశాడు అర్జున్. ఇక అశ్వగంధ అలియాస్ గౌతమ్ కృష్ణకి ఎవరు గ్రూప్ గా ఆడుతున్నారో? ఎవరు సేఫ్ గేమ్ అవుతున్నారో అర్థం కాక అంబటి అర్జున్ ని అన్న అన్న అంటు అతనేం చెప్పిన గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. దీంతో హౌస్ లో వీళ్ళిద్దరి ప్రవర్తన వల్ల వీరిద్దరికి నెగెటివిటి బాగా పెరిగింది.

హౌస్ లోకి రైతుబిడ్డగా ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రతీ టాస్క్ లో తన వంద శాతం ఇస్తున్నాడు. టాస్క్ అంటే ప్రాణం పెట్టి ఆడుతానంటూ పల్లవి ప్రశాంత్ చాలాసార్లు చెప్పాడు.. చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఎవిక్షన్ పాస్ కోసం జరిగిన రేస్ లో బ్యాలెన్సింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో హౌస్ మేట్స్ అంతా పోటీ పడ్డారు. ఒక స్టాండ్ కి ముందు భాగంలో టేబుల్ మీద మొదట ఒక ప్లేటు, తర్వాత సాసర్, చిన్న కప్, పెద్ద ప్లేట్ అని బిగ్ బాస్ చెప్పిన విధంగా పేర్చుకుంటూ రావాలి. ఇది గేమ్ అని ఇందులో గెలిచిన వారిదే ఎవిక్షన్ పాస్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఇక టాస్క్ మొదలైన కొద్ది సమయానికి శోభాశెట్టి అవుట్ అయింది. ఆ తర్వాత అమర్ దీప్, శివాజీ, అంబటి అర్జున్, యావర్, రతిక ఇలా వరుసగా అవుట్ అయ్యారు. ఇక చివరగా అశ్వినిశ్రీ, ప్రియంక, పల్లవి ప్రశాంత్ ఉండగా.‌. అశ్వినిశ్రీ అవుట్ అయింది. కాసేపటికి ప్రియాంక అవుట్ అయింది. పల్లవి ప్రశాంత్ ఒక్కడే మిగిలాడు. కాసేపటికి " ఉడతా ఉడతా ఊచ్" పాటని పల్లవి ప్రశాంత్ ని పాడమ్మన్నాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో గెలిచి ఎవిక్షన్ పాస్ ని పల్లవి ప్రశాంథ్ సొంతం చేసుకున్నాడని బిగ్ బాస్ చెప్పేదాకా ఆ బ్యాలెన్స్ ని అలాగే కంటిన్యూ చేశాడు పల్లవి ప్రశాంత్.‌

ఎవిక్షన్ పాస్ టాస్క్ ముందు నామినేషన్ లో.. ఇటుకల టాస్క్ లో ఎన్ని ఇటుకలు తెచ్చావ్? అసలేం ఏం ఆడావని రతిక అన్న ప్రశ్నకి నోటితో చెప్పకుండా ఎవిక్షన్ పాస్ గెలిచి చూపించాడు ప్రశాంత్. అలాగే గౌతమ్ చేసిన సిల్లీ నామినేషన్.. గతవారం జరిగిన టాస్క్ లో శోభాశెట్టి, ప్రశాంత్ ఇద్దరు సంఛాలకులుగా ఉండగా ప్రశాంత్ సంఛాలకుడిగా ఫెయిల్ అయ్యాడని గౌతమ్ నామినేట్ చేశాడు.‌ అతని ప్రశ్నకి ఆడి గెలిచి చూపించాడు ప్రశాంత్. ఇక ప్రశాంత్ గెలిచాక శివాజీ వెళ్ళి హత్తుకొని.. గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా నువ్వు అంటూ‌ శివాజీ‌ అన్నాడు.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.