English | Telugu
Guppedantha Manasu: ఇంటికి రాకని అనుపమకి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర!
Updated : Nov 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -927 లో.. జగతి ఫోటో మహేంద్ర చూస్తు.. అనుపమ అన్న మాటలు గుర్తుకుచేసుకుంటాడు. అప్పుడే రిషి వచ్చి.. మీ ఫ్రెండ్ ని అలా వదిలేసి వచ్చారని అడుగుతాడు.. తన మాటలు చాలా బాధగా ఉన్నాయి. అందుకే అని మహేంద్ర అంటాడు. మీరు ఎందుకో ఆవిడా నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పాలా అని రిషి అనగానే.. వద్దని మహేంద్ర చెప్తాడు. మరి వెళ్ళండి అక్కడికి అని రిషి చెప్తాడు.
మరోకవైపు వసుధార గురించి దేవయాని చెప్పిన మాటలు అనుపమ గుర్తుకు చేసుకొని.. నువ్వు ఇప్పుడు ఎండీ కదా? ఆ పదవి అంటే చాలా బరువు బాధ్యతలు ఉంటాయి. అనుభవం ఉండాలి. మరి ఇంత చిన్న ఏజ్ లో ఆ స్టేటస్ కి వచ్చావంటే గ్రేట్ అని అనుపమ అనగానే.. నేను రాలేదు రిషి సర్ నన్ను కూర్చోపెట్టారని వసుధార అంటుంది. నీ కంటే ముందు ఎండీగా ఎవరున్నారని అనుపమ అడుగుతుంది. జగతి మేడమ్ ఉన్నారని వసుధార చెప్పగానే.. అనుపమ డౌట్ గా చూస్తూ నువ్వు డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తావా? హోదాకి ప్రాముఖ్యత ఇస్తావా అని అడుగుతుంది. అవి రెండు కాదు ప్రేమకు ప్రాముఖ్యత ఇస్తానని వసుధార చెప్తుంది. ఈవిడేంటి ఇలా అడుగుతుందని వసుధార తన మనసులో అనుకొని.. మీరు నా గురించి ఏం అనుకున్న పర్వాలేదు. మీరు జగతి మేడన్ ఫ్రెండ్. నేను మేడమ్ ని ఎలా చూస్తానో, మిమ్మల్ని అలానే చూస్తానని వసుధార అంటుంది.. ఈ అమ్మాయి చాలా తెలివిగలదని అనుపమ అనుకుంటుంది. అప్పుడే మహేంద్ర వచ్చి.. అనుపమకి ఇష్టమైన వంటలు వసుధారకి చెప్పి ప్రిపేర్ చెయ్యమని చెప్తాడు. మరొకవైపు వంట చేస్తున్న ధరణి దగ్గరికి శైలేంద్ర వచ్చి.. తనతో ప్రేమగా మాట్లాడుతాడు. అది చూసి ధరణి మురిసిపోతుంది. ఆ తర్వాత ధరణికి శైలేంద్ర చీర గిఫ్ట్ గా ఇస్తాడు. అలా శైలేంద్ర ప్రేమగా మాట్లాడుతుంటే ధరణి ఎమోషనల్ అవుతుంది.
మరొకవైపు రిషి, వసుధార, అనుపమ మహేంద్ర అందరు కలిసి భోజనం చేస్తుంటారు. అనుపమ, మహేంద్ర తమ కాలేజీ డేస్ లో చేసిన చిలిపిపనులు గుర్తుకు చేసుకుంటారు. వాళ్ళిద్దరిని రిషి గమనిస్తుంటాడు. ఆ తర్వాత మీ హస్బెండ్ ఏం చేస్తారని వసుధార అనగానే.. అనుపమ సైలెంట్ అవుతుంది. కాసేపటికి అనుపమ వెళ్లిపోతు.. ఇందాక నువ్వు ఒక్కటి అడిగావు కదా? నేను పెళ్లి చేసుకోలేదు. ఒంటరిగా ఉన్నాను. జగతి పెళ్లి చేసుకోని ఒంటరిగా ఉంది. నేను చేసుకోక ఒంటరిగా ఉన్నానని అనుపమ అనగానే.. " అనుపమ.. నువ్వు ఇంకొకసారి ఇక్కడికి రాకు" అని మహేంద్ర కోప్పడి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత డాడ్ మాటలు పట్టించుకోకండి వస్తూ ఉండండి అని రిషి అనగానే.. వస్తాను, నువ్వు ఒక పని చెప్పావ్ కదా మీ డాడ్ ని జగతి బాధ నుండి బయటకు తీసుకొని రమ్మని చెప్పావ్ కదా? మిమ్మల్ని చూడడానికి వస్తానని అనుపమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.