English | Telugu
సలార్ మూవీని రెండు సార్లు చూడాలి...ఫస్ట్ టైం అర్ధం కాదు!
Updated : Dec 23, 2023
ఇప్పుడు ఎటు చూసిన సలార్ మూవీ ఫీవర్ తో జనం ఊగిపోతున్నారు. ఈ మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ కూడా ఫ్రూట్ సలాడ్ అంత టేస్టీ రివ్యూస్ ని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అమ్మడు గీతూ రాయల్ కూడా ఈ సలార్ బెనిఫిట్ షోకి వెళ్లి దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. ఈ మూవీ మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గీతూ ఈ మూవీ గురించి చెప్తూ "ఫస్ట్ టైం చూస్తే ఈ సినిమా ఎవరికీ అర్ధం కాదు. ముందు ఈ మూవీ నేను ఫ్లాప్ అవుతుందని అనుకున్నాను.. ప్రభాస్ నటించిన ఈ సినిమా కూడా ఫ్లాపేనా అని ఫీల్ అయ్యాను.
ప్రభాస్ కటౌట్ ఈ సినిమాలో అదిరిపోయింది. ఈ సినిమా నాకు అర్థం కాలేదు... ఇందులో వచ్చే ఫైట్ సీన్స్ అసలెందుకు తెలియని కొన్ని ట్విస్టులు.. నాకు అసలు అర్థం కాలేదు. బహుశా నా బుర్ర తక్కువ కాబట్టి ఈ సినిమా అర్థం కాలేదేమో మరి. కానీ ఒకసారి సినిమా చూస్తే అర్థం కాదు రెండు సార్లు చూడాల్సిందే...లాస్ట్ మూవీలో ప్రభాస్ అందమే పోయింది అనుకున్నాం..ఐతే ఆ అందమంతా ఈ మూవీతో తిరిగొచ్చేసింది. ప్రభాస్ కటౌట్ ఏముందిలే...కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్టుగా ఉంది మూవీ. స్టోరీ వైజ్ సూపర్ గా ఉంది.
కానీ రెండు సార్లు చూస్తే అర్ధమవుతుంది." అని గీతూ చెప్పేసరికి ఈమెపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌కి సపోర్ట్ చేస్తున్నాం అనే ముసుగులో విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ కారుని బద్దలు కొట్టి.. అతని ఫ్యామిలీపై దాడి చేశారు. అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కార్లను, బిగ్ బాస్ బజ్ యాంకర్ గీతు రాయల్ కారును పగలగొట్టారు. అల్లరి మూకల దాడిలో భయాందోళనకు గురైన గీతూ రాయల్.. హైదరాబాద్‌లో మాదాపూర్ పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.