English | Telugu

Brahmamudi : మెహందీ వేడుకలో భార్యభర్తలు.. ఆ గుట్టు రట్టవనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -287 లో.. దుగ్గిరాల ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెహందీ ఫంక్షన్ ని అందరు సరదాగా జరుపుకుంటారు. భార్యలకి భర్తలే మెహందీ పెట్టాలని ఇందిరదేవి చెప్తుంది. అందరు దానికి ఇష్టంగానే ఉన్నా రాజ్, విక్కీ ఇద్దరు మాత్రం అయిష్టంగా ఉంటారు. ఫోన్ వచ్చి మాట్లాడుకుంటు వెళ్లినట్టు నటిస్తు పక్కకి వెళ్లిపోతారు.

ఆ తర్వాత వాళ్ళ చేత ఎలాగైన మెహందీ పెట్టించుకోవాలని కావ్య అనుకుంటుంది. అలాగే విక్కీని తోసుకొని రావడానికి పద్మావతి వెళ్తుంది. అలా వెళ్లి ఇద్దరు కన్విన్స్ చేసి రాజ్ , విక్కీ లని తీసుకోని వచ్చి వాళ్ళ చేత మెహందీ పెట్టించుకుంటారు.. మరొకవైపు అందరి ముందు స్వప్న పరువు తీయాలని, తనని బయటకు పంపిచెయ్యాలని, అరుణ్ ని రమ్మని అందరి ముందు స్వప్న కడుపులో బిడ్డకు తండ్రిని నేనే అని చెప్పమని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. అరుణ్ ని రాహుల్ రమ్మని చెప్తాడు. రాజ్ , విక్కీ ఇద్దరు మెహందీ పెడుతున్నంత సేపు అయిష్టంగానే ఉంటారు. కానీ కావ్య, పద్మావతి ఇద్దరు మాత్రం వాళ్ళు మెహందీ పెడుతుంటే ప్రేమగా చూస్తుంటారు. మరొకవైపు అనామికకి కళ్యాణ్ మెహందీ పెట్టడం అయిపోయాక.. అప్పు నీకు మెహందీ పెడతాను రా అని కళ్యాణ్ పిలుస్తాడు. అప్పు నాకు వద్దని చెప్పినా కళ్యాణ్ బలవంతపెట్టడంతో అప్పు వచ్చి మెహందీ పెట్టించుకుంటుంది. అలా అప్పుకి కళ్యాణ్ మెహందీ పెట్టడం అనామికకి ఇంక తన పేరెంట్స్ కి నచ్చదు. అప్పు వైపు అనామిక కోపంగా చూస్తూ ఉంటుంది.

మరొకవైపు స్వప్నకి అరుణ్ కనిపిస్తాడు. అదే విషయం పద్మావతి, కావ్యలకి చెప్తుంది స్వప్న. అనామిక మెహందీ కంటే అప్పు మెహందీ బాగుందని కళ్యాణ్ అనగానే.. అనామిక విని కోపంగా వెళ్లిపోతుంది. మరొకవైపు అరుణ్ ని ఒక తాగుబోతు ఆపుతాడు. అప్పుడే కావ్య, స్వప్న, పద్మావతి వెళ్లి అరుణ్ ని పట్టుకొని కొట్టాలని అనుకుంటారు కానీ అరుణ్ తప్పించుకుంటాడు. అప్పుడే కనకం వచ్చి అరుణ్ ని కొడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.