English | Telugu

అమ్మకోసం సర్ ప్రైజ్ షాపింగ్ చేసిన శోభాశెట్టి!


బిగ్ బాస్ సీజన్-7 లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో మొదట రైతు బిడ్డ ప్రశాంత్ ఉంటే ఆ తర్వాత కార్తీక దీపం మోనిత అలియాస్ శోభాశెట్టి ఉందనే చెప్పాలి. హౌస్ లోకి వెళ్ళినప్పుడు మొదట్లో చాలా సాధారణంగా కనిపించిన శోభాశెట్టి.. మెల్లి మెల్లిగా చంద్రముఖిలా మారిపోయిందంటూ ప్రతీవారం ఫుల్ ట్రోల్స్ వచ్చేవి. వాటిని వీకెండ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ లో హోస్ట్ నాగార్జున బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు.

బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి ఆటతీరు, మాటతీరుకి ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు ప్రియాంక, అమర్ దీప్ లతో కలిసి గ్రూప్ గా ఉంటు టాస్క్ లలో కూడా గ్రూప్ గా ఆడుతూ, నామినేషన్ టైమ్ లో అందరు కలిసి ఎవరెవరిని నామినేషన్ చేయాలని మాట్లాడుకోవడం అన్నీ కూడా తనకి మరింత నెగెటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. అయితే ఆటలో ఉన్నప్పుడు ఫౌల్ చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కానీ మరీ సంఛాలక్ గా ఉండి కూడా ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేసేది. ఇక మొదటి వారం నుండి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియాంక కలిసి చేసిన నామినేషన్ లు చాలానే ఉన్నాయి.

ఇక అందరు కలిసి ప్రశాంత్ ని టార్గెట్ చేయడంతో శివాజీ అతనికి సపోర్ట్ చేస్తూ నిలిచాడు. ప్రతీసారీ ప్రశాంత్ కి వెన్నెంటే ఉండటంతో శోభాశెట్టి, అమర్, ప్రియాంక వాళ్ళు జెలస్ తో ఏదో ఒక కారణంతో నామినేషన్ లో పెట్టేవాళ్ళు. అతడికి గాయాలు చేస్తూ ఇబ్బందిపెట్టేవాళ్ళు. అయితే శోభాశెట్టి హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనేవాళ్ళు ఎందుకంటే తనెంత చెత్త ఫర్ఫామెన్స్ ఇచ్చిన, ఓటింగ్ లో ఎంత లీస్ట్ లో ఉన్న తను మాత్రం ప్రతీవారం సేఫ్ అయ్యేది.

శోభాశెట్టి సంఛాలక్ గా ఎన్నిసార్లు ఫెయిల్ అయిన బిగ్ బాస్ మాత్రం తననే సంఛాలక్ చేసేవాడు. అలా ప్రతీవారం తను ఎలిమినేట్ అవ్వాలని ప్రేక్షకులు ఓట్లు వేయకుండా తనకన్న దిగువన ఏ కంటెస్టెంట్ ఉన్నా వారికి భారీగా ఓట్లేసేవారు. అయిన బిగ్ బాస్ తననే సేవ్ చేసేవాడు. అందుకే ఈ దత్తపుత్రికని లాస్ట్ వీక్ వరకు ఉంచాడు. ఇక ఫినాలేకి ఒక్క వారం ముందు శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించాడు. అయితే శోభాశెట్టి ఎలిమినేషన్ తర్వాత ఎంతోమంది ప్రేక్షకులు.. నువ్వు ఎప్పుడో బయకు రావాల్సింది, చాలా లేట్ గా వచ్చవంటూ కామెంట్లు చేశారు.

అయితే శోభాశెట్టి బిగ్ బాస్ తర్వాత తన షూటింగ్ పనుల్లో బిజీ అయింది. ఇప్పుడు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. ఇందులో వాళ్ళ అమ్మ కోసం ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ తీసుకుంటున్నట్టు చెప్పింది శోభా. ప్రస్తుతం షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న శోభా త్వరలో వాళ్ళ అమ్మ కోసం బెంగుళూరు వెళ్తున్నట్టు, అందుకే తనకి గుర్తుండిపోయేలా ఏదైన సిల్వర్ జ్యువలరీ తీసుకోవాలనుకుందంట‌. అందుకే కొత్తగా ప్రారంభమైన ఓ జ్యువలరీ షోరూమ్ లోకి షాపింగ్ కి వెళ్ళింది. ఇక వాళ్ళ అమ్మ కోసం సర్ ప్రైజ్ షాపింగ్ చేశానంటు తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.