Akhanda 2 Teaser: మరి కాసేపట్లో రిలీజ్ అయ్యే అఖండ 2 టీజర్ హైలెట్స్ ఇవే
గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)సిల్వర్ స్క్రీన్ పై పోషించిన క్యారెక్టర్స్ మరో హీరో పోషించలేదంటే అతిశయోక్తి కాదు. ఈ విషయాన్నీ చాలా మంది హీరోలు బహిరంగంగానే చెప్తుంటారు. సాంఘిక, పౌరాణిక, జానపద, ఫిక్షన్, ఫ్యాక్షన్, డేవోషనల్ కి సంబంధించిన చిత్రాల ద్వారా ఆయా క్యారెక్టర్స్ ని అద్భుతంగా పోషిస్తు అభిమానులు,ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నాడు. అసలు బాలకృష్ణ ఒక క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసాడంటే సదరు క్యారక్టర్ మన మనస్సులో నుంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అంత చరిష్మా బాలకృష్ణ సొంతం.