English | Telugu

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!


-ఎందుకు డిలీట్ చేసింది
-అసలు కారణం ఏంటి!
-మరి పెళ్లి ఉందా!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.

ఈ అనుమానం రావడానికి కారణం లేకపోలేదు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ఇనిస్టాగ్రమ్ లో ఆ ఇద్దరు జంటగా కలిసి ఉన్న ఫోటోలు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఇప్పుడు వాటిని తమ ఇనిస్టా అకౌంట్ నుంచి ఇద్దరు డిలేట్ చేశారు. ఒకరికొకరు అన్ ఫాలో కూడా చేసుకోవడం కూడా జరిగింది. దీంతో ఈ ఇద్దరి పెళ్లి క్యాన్సిల్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఐదు సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి తేలిన నివేత, రజిత్ లు ఈ విషయంపై ఏమని స్పందిస్తారో చూడాలి.

తమిళనాడు లోని మదురైకి చెందిన నివేత 2017 లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన 'మెంటల్ మదిలో' అనే చిత్రంతో సోలో హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, దాస్ కి దమ్కీ, వంటి చిత్రాలతో అలరించింది.పలు తమిళ చిత్రాల్లో కూడా మెరిసిన నివేత చివరిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'పార్టీ' అనే మూవీ చేసింది. షూటింగ్ పూర్తయ్యి చాలా కాలం అయినా ఇంకా రిలీజ్ కాలేదు.