English | Telugu

అధ్యక్షఎన్నికల్లో జానీ మాస్టర్ వైఫ్ సుమలత విజయం..శ్రష్టి వర్మకి షాక్!

-ఎలా విజయం సాధించాడు
-ఏం జరిగింది!
-ఎన్ని ఓట్లు మెజారిటీ

కొరియోగ్రాఫర్ గా ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ని డైరెక్ట్ చేసారు జానీమాస్టర్(Jani Mater). ఎంతో మంది హీరోల అభిమానులు తమ అభిమాన హీరో సినిమాకి జానీ మాస్టర్ పని చేయాలనీ కోరుకుంటారు. అంతలా తన స్టెప్స్ తో మెస్మరైజ్ చెయ్యగలడు. ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న'పెద్ది' లోని 'చికిరి' సాంగ్ జానీ మాస్టర్ కంపోజ్ చేసిందే. రీసెంట్ గా తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య 'సుమలత' అలియాస్ అయేషా అధ్యక్ష పదవికి పోటీ చేసింది. ఆమె ప్రధాన ప్రత్యర్థిగా జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌ పోటీ చేసాడు.


జోసెఫ్ మాస్టర్‌ కి శేఖర్ మాస్టర్, భానుమాస్టర్, రఘు మాస్టర్, పొల్లకి విజయ్, జోజో శామ్, చంద్రకిరణ్ వంటి సీనియర్ డాన్స్ మాస్టర్లు బహిరంగంగా తమ మద్దతు ప్రకటించారు. అన్నిటికంటే ముఖ్యంగా జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు చేసిన ప్రముఖ డాన్సర్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ జోసెఫ్ కి మద్దతుగా నిలబడటమే కాకుండా జానీ మాస్టర్ వైఫ్ ని ఎలక్షన్స్ జరుగుతున్నంత సేపు పోలింగ్ జరిగే ఏరియాలోనే ఉండి ఓటర్లని ప్రభావితం చెయ్యడానికి వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.కానీ ప్రత్యర్థులందరికి షాక్ ఇస్తు జానీ మాస్టర్ వైఫ్ ఘన విజయం సాధించింది.


also read:47 ఏళ్ల హీరోకి జోడిగా సాయి పల్లవి!.. ఫ్యాన్స్ ఏమంటారో మరి

అసోసియేషన్ లో మొత్తం 510 ఓటర్లు ఉండగా, 439 మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జానీ మాస్టర్ వైఫ్ కి అత్యధికంగా 228 ఓట్లు రాగా, ప్రత్యర్థి జోసెఫ్ మాస్టర్‌కి 199 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి చంద్రశేఖర్‌ కి 11 ఓట్లు లభించాయి. దీంతో 29 ఓట్ల మెజారిటీతో జానీ మాస్టర్ వైఫ్ గెలుపొందింది. అసోసియేషన్ లో ఎలాంటి పెద్దల సపోర్ట్ లేకుండా జానీ మాస్టర్ వైఫ్ విజయం సాధించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో జానీ మాస్టర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ గెలుపు జానీ మాస్టర్ గెలుపు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


సుమతీ శతకం టీజర్, ట్రైలర్ కి మాస్ మహారాజా ప్రశంసలు..ఫిబ్రవరి 6న మైత్రి రిలీజ్ 

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు(MM naidu)దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సుమతి శతకం'. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్  డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుంచి మంచి అభినందనలు లభించాయి.

పారిశుధ్య కార్మికురాలికి రజినీకాంత్ కానుక.. మొత్తం 45 తులాల బంగారం

చాలా ఇంట్రస్ట్ గా ఒక సినిమా చూస్తున్నాం. హీరో రేంజ్ ని పెంచడానికో, హీరోయిన్ రేంజ్ ని పెంచడానికో, లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ ని పెంచడానికో ఆ ముగ్గురిలో ఏదైనా క్యారక్టర్ రోడ్ పై నడిచి వెళ్తున్నప్పుడు 45 తులాల బంగారంతో ఉన్న బ్యాగ్ కనపడేలా సన్నివేశాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఆ బంగారం తనకి దొరికింది. కానీ సదరు క్యారక్టర్ ఎలాంటి దుర్బుద్ధి కి పోకుండా తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బంగారం బ్యాగ్ అప్పగిస్తుంది. ఆ సమయంలోనే పోలీస్ స్టేషన్ లో బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి బోరుమంటూ ఏడుస్తూ ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.