English | Telugu
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
Updated : Dec 8, 2025
ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీస్‌కి సంబంధించిన ఫోటోలతో రకరకాల వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో కొన్ని పాజిటివ్‌గా ఉంటే, మరికొన్ని వారి ఇమేజ్‌ని దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. వాటి వల్ల వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. తమ అనుమతి లేకుండా ఇలా ఫోటోలు వాడటం అనేది కరెక్ట్ కాదని, దాన్ని నివారించాలంటూ సెలబ్రిటీలు కోరుతున్నారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విషయమై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ఫోటోలు వాడకూడదు అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు చిరు. ఇప్పుడు అదే పద్ధతిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఫిర్యాదు చేశారు. తగిన చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఇకపై తన ఫోటోలు, పేరు వాడుకోకుండా ఆదేశాలు జారీ చెయ్యాలంటూ పిటిషన్ వేశారు. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. ఈకామర్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను డిసెంబర్ 22కి వాయిదా వేసింది.