English | Telugu

సినీ ప్రముఖులతో సమావేశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ!

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాలలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఇది నిర్వహిస్తున్నారు. ఇందులో సినీ పరిశ్రమకు కూడా పెద్ద పీట ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశమయ్యారు.

తెలంగాణలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్నిరకాల సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని వివరించారు. 24 క్రాఫ్ట్స్ లో సినిమా ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా స్థానికులను ట్రైన్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని రేవంత్ తెలిపారు. స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్ళేలా రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Also Read: వారణాసిలో ఐదు పాత్రల్లో మహేష్.. ఏం ప్లాన్ చేశావయ్యా జక్కన్న!

రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, చిరంజీవి, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, అక్కినేని అమల, జెనీలియాతో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన హీరోయిన్.. పెళ్లి క్యాన్సిల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అలవైకుంఠ పురం' సాధించిన విజయం తెలిసిందే. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ కేటగిరి లో మెరిసిన భామ 'నివేత పేతురేజ్'. ఈ ఏడాది ఆగష్టులో సోషల్ మీడియా వేదికగా నివేత మాట్లాడుతు నేను దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రజిత్ ఇబ్రాన్ తో  రిలేషన్ లో ఉన్నట్టుగా వెల్లడి చేసింది. వెల్లడి చెయ్యడమే కాదు ఇంట్లో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని వచ్చే ఏడాది జనవరిలోనే మ్యారేజ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులతో పాటు పలువురు నెటిజన్స్ నివేత కి కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పెళ్లి పెళ్లి పీటల వరకు వెళ్లేలా లేదనే అనుమానాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.