నందమూరి హీరో రీ-ఎంట్రీ.. ఆ విషాద ఘటనతో 35 ఏళ్ళు నటనకు దూరం!
నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఈ తరం వారికి ఈ పేరు పెద్దగా తెలిసుండదు. కానీ, అప్పట్లో తక్కువ సినిమాలతోనే తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు కళ్యాణ్ చక్రవర్తి. అయితే ఒక విషాద ఘటన వల్ల ఆయన నటనకు దూరమయ్యారు. లేదంటే, నటుడిగా వందల సినిమాలు చేసేవారు. అలాంటి కళ్యాణ్ చక్రవర్తి, ఏకంగా 35 ఏళ్ళ తర్వాత ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు.