English | Telugu

సీతారామం పార్ట్ 2 కి ఆ హీరో, హీరోయిన్ మీకు ఓకేనా!.. వైరల్ గా మారిన పిక్ 

-సీతారామం సీక్వెల్ కి ముహూర్తం దగ్గర పడిందా!
-ఎవరెవరు ఉండబోతున్నారు
-సంచలనం గా మారిన పిక్
-సినీ విశ్లేషకులు ఏమంటున్నారు



నిజాయితీ, నిబద్దత,సంస్కారం తో కూడిన స్వచ్ఛమైన ప్రేమని సెల్యులాయిడ్ పై ప్రత్యక్షం చేసిన అపురూపమైన ప్రేమ చిత్రాల్లో 'సీతారామం ఒకటి. ప్రేమ అనేది కమర్షియల్ కాదు ఎమోషనల్. దాని ముందు మరణం చాలా చిన్నదనే విషయాన్నీ కూడా బలంగా చెప్పిన ఈ కల్ట్ క్లాసిక్ కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. సదరు ఫ్యాన్ బేస్ విషయంలో అభిమానులు, ప్రేక్షకులు పోటీ పడుతు ఉంటారు. రిలీజ్ అయ్యి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళ హృదయాల్లో సీతారామంకి ప్రత్యేక అర ని ఏర్పాటు చేసుకోవడమే అందుకు సాక్ష్యం. అంతటి ప్రత్యేకతని అందుకున్న సీతారామం ఇప్పుడు ఒకే ఒక్క పిక్ తో ఎన్నో సందేహాలకి సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ డీటెయిల్స్ ని పూర్తిగా చూద్దాం.

సోషల్ మీడియాలో రీసెంట్ గా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వర్షంలో గొడుగు కింద ఎదురెదురుగా నిలబడి ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమగా చూసుకుంటున్నారు. దీంతో సీతారామం సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లబోతుందా అనే కామెంట్స్ ని ఫ్యాన్స్ తో పాటు సీతారామం లవర్స్ చేస్తున్నారు.దీంతో సినీ విశ్లేషకులు స్పందిస్తు సీతారామం లో రామ్ చనిపోయినట్టుగా క్లియర్ గా చూపించారు. కాబట్టి సీక్వెల్ కి ఆస్కారం అనేది ఉండకపోవచ్చు. దుల్కర్ సల్మాన్ ఒక సందర్భంలో సీక్వెల్ విషయంపై స్పందిస్తు క్లాసిక్ గా నిలిచిన సినిమాలని టచ్ చేయకూడదనే విషయాన్నీ సినిమాల్లోకి రాక ముందే తెలుసుకున్నాను. కాబట్టి సీక్వెల్ ఉండదని చెప్పాడు.

హను రాఘవపూడి, స్వప్న దత్, ప్రియాంక దత్ కూడా ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. కాబట్టి సదరు స్టిల్ దుల్కర్ , మృణాల్ కొత్త చిత్రానికి సంబంధించింది కావచ్చు. మేకర్స్ సదరు చిత్రాన్ని అధికారకంగా ప్రకటించే ముందు ప్రమోషన్స్ లో భాగంగా పోస్టర్ రిలీజ్ చేసి ఉండవచ్చు లేక ఏఐ తో అభిమానులు క్రియేట్ చేసి ఉండవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Also read:దీన్ని అసలు రికార్డు అంటారా.. ఎవరు అక్కడ సెట్ చేసింది.

ఏది ఏమైనా అంతిమంగా సెల్యులాయిడ్ పై ఏమైనా జరగచ్చు. కాబట్టి సదరు స్టిల్ సీతారామం సీక్వెల్ కి సంబంధించి ఏమో. ఒక వేళ నిజమైతే అదే క్యాస్టింగ్ ఉంటుందా లేదా అనేది చూడాలి. సీతారామం దర్శకుడు హను రాఘవపూడి ప్రెజంట్ ప్రభాస్ తో చేస్తున్న 'ఫౌజీ' తో బిజీగా ఉన్నాడు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం