English | Telugu

దీన్ని అసలు రికార్డు అంటారా.. ఎవరు అక్కడ సెట్ చేసింది     

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ పై ఏం జరుగుతుంది
అల్లు ఆర్మీ రెస్పాన్స్ ఏంటి
మరి ముందు ముందు రికార్డులు ఉంటాయా!


కొన్ని కాంబినేషన్స్ ఇచ్చే కిక్కు ఫుల్ బాటిల్ మందు తాగినా రాదు. అలాంటి కిక్కుని అభిమానులకి, ప్రేక్షకులకి ప్రీ గా ఇస్తున్నారు అల్లు అర్జున్(Allu Arjun),లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj). అసలు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇన్ క్లూడింగ్ అల్లు ఆర్మీతో సహా. అలాంటిది ఏకంగా సంక్రాంతికి వెల్ కమ్ చెప్తు థీమ్ సాంగ్ తో అధికార ప్రకటన ఇచ్చేసి సిల్వర్ స్క్రీన్ ని వశం చేసుకోవడానికి రెడీ కాబోతున్నారు. ఇప్పుడు ఆ థీమ్ సాంగ్ దెబ్బకి సోషల్ మీడియా సైతం కొంచం రెస్ట్ ఏమైనా ఇస్తారా అని అడిగే పరిస్థితి.. సోషల్ మీడియాకే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం.


థీమ్ సాంగ్ పై ఇనిస్టా లో 355000 రీల్స్ క్రియేట్ అయ్యాయి. ఇది నిజం.. అక్షరాల మూడు లక్షల యాభై ఐదు వేల రీల్స్ చేసారు. పైగా ఇంకో అరుదైన రికార్డు ఏంటంటే కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతున్న 'ఇట్స్ మై సెల్ఫ్' వీడియోకి సదరు థీమ్ సాంగ్ ని ఉపయోగిస్తున్నారు. దీంతో పదమూడు రోజుల్లోనే లక్షల రీల్స్ అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ తమ ఖాతాలో ఒక రికార్డుగా ఉంచుకున్నట్లయింది. సదరు రికార్డుపై అల్లు ఆర్మీ స్పందిస్తు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. రికార్డు అనే పదాన్ని మార్చేసి కొత్త పేరు పెట్టాలనేడిమాండ్ ముందు ముందు వింటారని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

also read: ప్రభాస్, సాయిపల్లవి కాంబో ఫిక్స్ అయ్యిందా!


ఈ సంవత్సరమే షూట్ కి వెళ్లనుండగా పుష్ప ,పుష్ప 2 తో పాన్ ఇండియా బ్యానర్ గా గుర్తింపు పొందిన మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. లోకేష్ గత చిత్రాల జర్నీప్రకారం సదరు చిత్రానికి సంబంధించిన కథ, కథనాలతో పాటు క్యాస్టింగ్ పై కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee)అండర్ లో ఉన్న విషయం తెలిసిందే.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం