English | Telugu

టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత!

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. టీవీ, రేడియో రంగాలతో పాటు సినీ పరిశ్రమలో సంగీత దర్శకుడిగా రాణించిన నల్లూరి సుధీర్ కుమార్ (Nalluri Sudheer Kumar) కన్నుమూశారు. గురువారం ఉదయం హైదరాబాద్ లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

మచిలీపట్నంకు చెందిన సుధీర్ కుమార్.. సంగీతంపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. దూరదర్శన్ తొలినాళ్ళలో సుధీర్ కుమార్ ఎన్నో పాటలను స్వరపరిచారు. 1986-2000 మధ్య కాలంలో దూరదర్శన్ సీరియల్స్‌కు అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత దర్శకులలో ఒకరిగా నిలిచారు. టీవీ సీరియల్స్ కు సంగీతం అందించి, ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. పలు సినిమాలకూ సంగీత దర్శకుడిగా పనిచేశారు. 'అగ్ని ప్రవేశం', 'కూతురు', 'అమ్మో అల్లుడా' వంటి చిత్రాలకు సంగీతం అందించారు.

సుధీర్ కుమార్ మృతి పట్ల టీవీ, సినీ రంగాలకు చెందిన పలువురు సంతాపం తెలుపుతున్నారు.

Also Read: సినిమాలకు బ్రేక్ ఇస్తున్న రామ్ చరణ్!

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం