అమరావతికి ఆహ్వానం మూవీ టీజర్ విడుదల.. ఫిబ్రవరి 13 మూవీ రిలీజ్
శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా "అమరావతికి ఆహ్వానం". సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీకే దర్శకుడు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు నిర్మించారు