డబ్బు పోగొట్టుకున్న విజయ్ సేతుపతి.. వాళ్ళు బాగుంటే చాలు
మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి(Vijay Sethupathi)సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం ఈలలు, కేకలు. రెండు దశాబ్దాలుగా ఇదే తంతు. ఇప్పుడు ఆ తంతు తెలుగు ప్రేక్షకులకి కూడా ఒక ఆనవాయితీ గా మారింది. మాస్టర్, ఉప్పెన,విక్రమ్, మహారాజు, సర్ మేడమ్ వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. అదే ఆనవాయితీ కంటిన్యూ చేయించాలనే లక్ష్యంతో రేపు ' గాంధీ టాక్స్'(Gandhi Talks)అనే వినూత్నమైన టైటిల్ తో కూడిన మూవీతో థియేటర్స్ లో ల్యాండ్ అవుతున్నాడు.