1000 కోట్ల సినిమాకు కాన్పెప్ట్ రెడీ.. మరి నిర్మాత ఎక్కడ?
ఎన్ని బ్లాక్బస్టర్స్ ఇచ్చిన దర్శకుడైనా ఒక దశలో సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. టాప్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకొన్న కొందరికి ఇది అనుభవమే. 1993లో జెంటిల్మెన్ చిత్రంతో సంచలన విజయం సాధించి డైరెక్టర్గా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు శంకర్. ఆ సినిమా తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకేఒక్కడు, బార్సు, అపరిచితుడు, శివాజీ, రోబో వంటి భారీ విజయాలతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా ఎదిగారు.