English | Telugu

రంగాపురం రంగనాయకిగా విష్ణుప్రియ.. షూటింగ్ లో కాలుకి గాయం!




బుల్లితెర టీవీ యాక్టర్స్ కొందరు వెండితెరపై కనపడటానికి తెగ ట్రై చేస్తుంటారు. వారిలో కొందరు యాంకర్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్ నుండి కెరీర్ ప్రారంభించి వెండితెరపై రాణిస్తున్న వారిలో అనసూయ ఒకరు. అలాగే రష్మి కూడా తనకి వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటు ముందుకెళ్తుంది. ఇప్పుడు అదే బాటలో యాంకర్ విష్ణు ప్రియ నడుస్తుంది.

ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్లు బిజీగా ఉండేది విష్ణుప్రియ. కానీ సినిమాలపై కాన్సట్రేషన్ చేయడానికి షోలు అన్నీ వదిలేసింది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పటివరకూ విష్ణుకి సరైన రోల్ అయితే దక్కలేదు. గ‌తంలో అడ‌పాద‌డ‌పా షూట్లతో , బీచ్ టూర్ల‌తో కాల‌క్షేపం చేస్తూ ఆ ఫొటోలు, వీడియోలు ఇన్ స్టాలో షేరు చేస్తూ కుర్ర‌కారుకు అందాల‌ను పంచిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు మరో ఆల్బమ్ సాంగ్ తో రెడీ అయింది. అంతకముందు మానస్ తో కలిసి 'గంగులు' అనే ఫోక్ సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభించింది.

ఇప్పుడు తాజాగా విష్ణుప్రియ తన యూట్యూబ్ ఛానెల్ లో ' రంగాపురం రంగనాయకి సాంగ్ షూట్ BTS ' అంటు ఓ వీడియోని అప్లోడ్ చేసింది. ఇందులో తను డ్యాన్స్ ప్రాక్టీసు చేస్తున్న కొన్ని క్లిప్స్ పెట్టి, తన కాలికి గాయం అయిందని చెప్పుకొచ్చింది. కాలికి లేపనం రాసుకుందంట. ఇక రేపు తంజావురు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని తనకి శక్తిని ప్రసాదించమని వేడుకుంటుందంట. ఇదంతా ఈ వ్లాగ్ లో చెప్తూ విష్ణు ప్రియ ఎమోషనల్ అయింది. తన కాలికి గాయమైన సాంగ్ ఇన్ టైమ్ లో పూర్తి చేయాలని విష్ణు ప్రియ భావిస్తోంది. విష్ణు ప్రియకి యూట్యూబ్ లో 4.94 లక్షల సబ్ స్క్రైబర్స్ ఉండగా, ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఈ రంగాపూరం రంగనాయకిని ఎంతమంది ఆదరిస్తారో చూడాలి మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.