English | Telugu

Eto Vellipoyindhi Manasu : అత్తకి దిమ్మతిరిగే షాకిచ్చిన కోడలు.. అందరి ముందు భార్యతో అలా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -146 లో... సీతాకాంత్ ని తన పెళ్లి గురించి ఇంటర్వ్యూయర్ అడగ్గానే.. అది నా పర్సనల్ అంటూ కోపంగా లోపలికి వెళ్లిపోతాడు. ఇంటర్వ్యూయర్ వెళ్లిపోతుంటే.. ఆగండి అని సామల చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి వెళ్లి మీరు ఇలా ఎన్నిసార్లు చేస్తారు. ఒకసారి మీ పెళ్లి గురించి ప్రపంచానికి చెప్తే వాళ్ళు ఇంకోసారి ఇలా అడగరు కదా వాళ్ళకి మీరే అనే ఛాన్స్ ఇస్తున్నారని రామలక్ష్మి అనగానే.. సరే పదా కిందకి వెళదామని రామలక్ష్మిని తీసుకొని సీతాకాంత్ వెళ్తాడు. కెమెరా ఆన్ చెయ్యండి అని చెప్పి.. రామలక్ష్మిని తన పక్కన కూర్చొపెట్టుకుని తన భుజం మీద చెయ్యి వేస్తాడు.

రమ్యకృష్ణపై సంచలన కామెంట్స్ చేసిన వనితా విజయ్ కుమార్!

కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్ , దివంగత మంజుల కుమార్తె వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె.. రెగ్యులర్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇక తల్లిదండ్రులిద్దరూ అగ్ర నటులు కావడంతో వనితా విజయ్ కుమార్‌ చాలా సులభంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె .. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమెకు అవకాశాలు పెరిగాయి. కానీ తను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే మళ్ళీ తన కెరీర్ ని మొదలెట్టింది వనితా విజయ్ కుమార్. 

కోల్గేట్ పేస్ట్‌పై వేప పుల్లతో కౌశల్ పోరాటం!

కౌశల్ మందా గురించి పెద్దగా చెప్పక్కర్లేదు.  బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యధిక ఫాలోయింగ్ ని  సంపాదించుకున్న కంటెస్టెంట్‌గా కౌశల్ మందా. కౌశల్ ఆర్మీ కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది.  బిగ్ బాస్ సీజన్ 2 టైములో కౌశల్ ఇమేజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఆయన కోసం అప్పట్లో చాలా కార్యక్రమాలు చేసారు. తనను తాను ఓ హీరోలా ప్రొజెక్ట్ చేసుకున్నాడు కౌశల్.  నానిపై కూడా కౌశల్ అభిమానులు ఫైర్ అయ్యే రేంజ్ లో ఉంది కౌశల్ పవర్ . అలాంటి కౌశల్ తర్వాత కొన్ని షోస్ చేసాడు. తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ పెడుతూ ఉంటాడు. వాళ్ళ పిల్లల్తో కలిసి చేసిన వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటాడు.

అంబానీ ఇంట సెలెబ్రేషన్స్ తో ఎంతో మందికి ఉపాధి

గీతా మాధురి అంటే చాలు చిరుత మూవీలో పాడిన "చమ్క చమ్క చమ్కీరే" అనే సాంగ్ గుర్తొస్తుంది. ఈమె  చాలా వరకు ఐటెమ్‌ సాంగ్స్ ని తన హుస్కి  వాయిస్‌తో పాడుతూ ఆ పాటకే వన్నె తెస్తుంది. అసలు ఆ పాటు గీత తప్ప మరెవరూ పడలేరు అన్నట్టుగా ఉంటుంది. ఆమె పాడే  పాటలు కుర్రాళ్లని ఉర్రూతలూగిస్తాయి. ఆడియెన్స్ ని అలరిస్తాయి. తనదైన ప్రత్యేకమైన వాయిస్‌తో కట్టిపడేస్తుంది ఈ స్టార్‌ సింగర్‌. అలాంటి గీత ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి జడ్జ్ గా చేస్తోంది. ఇక గీత మాధురి రీసెంట్ గా ఒక పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టింది. "అంబానీ ఇంట్లో జరుగుతున్న వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ని మెచ్చుకోవాలసిందే.

Karthika Deepam2: మన ఇద్దరి దారులు ఎప్పటికీ ఒక్కటి కావు.. తన ఆచూకి దొరికేసింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -93 లో...శౌర్య ప్రతిసారి కార్తీక్ కార్తీక్ అంటుంటే.. దీపకి ఏం చెప్పాలో అర్థం కాదు. దీప బయటకు వచ్చి శౌర్యకి ఏమని చెప్పాలి ? ఎలా చెప్పగలనంటూ బాధపడుతుంటే అప్పుడే ఇంటిముందు నుండి ఒకతను వెళ్తుంటాడు. దీపని చూసి ఫిగర్ బాగుంది.. ఎలాగైనా నాదాన్ని చేసుకోవాలని అనుకుంటాడు. దీప అతన్ని కోపంగా చూసి లోపలికి వెళ్లిపోతుంది. మరొకవైపు సుమిత్ర దశరత్ లు పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్తారు. అక్కడ దీప గురించి మాట్లాడుతూ.. సుమిత్ర ఎమోషనల్ అవుతుంది.

Eto Vellipoyindhi Manasu : కొడుకుని మేనేజర్ చేయడానికి శ్రీలత కొత్త ప్లాన్.. రామలక్ష్మి ఆపేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -145 లో... శ్రీలత ఎలాగైనా సందీప్ ని జనరల్ మేనేజర్ ని చేయాలని అనుకుంటుంది. ఇంట్లో ఇంత జరుగుతున్నా మా అయనని జనరల్ మేనేజర్ ని చెయ్యడానికి బావగారు ఏమైనా పిచ్చోడా అని శ్రీవల్లి అంటుంది. అవును వాడు అమ్మ పిచ్చోడు. ఎలాంటి స్వార్థం లేదు.. మా అమ్మకి అనుకునే పిచ్చోడని శ్రీలత అంటుంది. జనరల్ మేనేజర్ అవ్వడానికి నేనొక ప్లాన్ చెప్తానంటూ సందీప్ కి శ్రీలత ప్లాన్ చెప్తుంది. ముందు జనరల్ మేనేజర్ అవ్వు.. ఆ తర్వాత ఆఫీస్ ని మొత్తం నీ గుప్పిట్లో పెట్టుకోమని సందీప్ కి చెప్తుంది శ్రీలత.

Guppedantha Manasu : ఇంటి జాడ చెప్పిన రంగా.. షాక్ లో వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1123 లో....వసుధార పెద్దావిడ దగ్గరికి వచ్చి.. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అంటుంది. ఏంటని ఆవిడా అంటుంది. మీ మనవడి పేరు నిజంగానే రంగానా అని వసుధార అడుగుతుంది. అవును అందరిని అడిగావు కదా అని పెద్దవిడా అంటుంది. మీ మనవడు చిన్నప్పుటి నుండి  మీ దగ్గరే ఉన్నాడా? అంటే చిన్నప్పుడు మీకు దూరంగా వెళ్ళిపోయి ఈ మధ్యే వచ్చాడా అని వసుధార అడుగుతుంటే.. ఆవిడ కంగారుపడుతుంది. లేదమ్మా నా మనవడు నాతోనే ఉన్నాడని పెద్దవిడ చెప్తుంది. అయితే మీరు ఎందుకు తడబడుతున్నారని వసుధార అనగానే... అదేం లేదని ఆవిడ అంటుంది. ఇన్ని రోజులు నా రిషి సర్ ని చూసుకున్నందుకు చాలా థాంక్స్ అని వసుధార అంటుంది.