English | Telugu

విడాకులు ఇవ్వమని టార్చర్ చేస్తున్నాడంటూ కేసు పెట్టిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -449 లో.. కళ్యాణ్ కి కావ్య నచ్చజెప్పి.. అనామికతో మాట్లాడమని తీసుకొని వస్తుంది. అందరు హాల్లోకి వస్తారు. మళ్ళీ కళ్యాణ్, అప్పుల గురించి అనామిక తప్పుగా మాట్లాడుతుంటే.. తనపై చెయ్యి చేసుకోబోతుంటాడు కళ్యాణ్. అప్పుడే అనామిక పేరెంట్స్ వస్తారు. చూడు నాన్న.. వాళ్ళు నాపై ఎలా దాడి చేస్తున్నారోనని అనామిక అంటుంది. కొట్టి చంపెయ్యండి దుగ్గిరాల ఫ్యామిలీ అంటే గొప్ప ఫ్యామిలీ అనుకున్న కానీ ఇలా చేస్తారనుకోలేదని అనామిక వాళ్ళ నాన్న అంటుంటే.. నీ కూతురు ఎలా మాట్లాడుతుందో చూడు.. నీకు దుగ్గిరాల ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత లేదని అనామిక నాన్నకి రాజ్ వార్నింగ్ ఇస్తాడు.

వాళ్ళని ఈ అనామికనే పిలిచి ఉంటుందని స్వప్న అనగానే.. నేనే పిలిచానని అనామిక అంటుంది. ఎందుకు పిలిచావని ప్రకాష్ అడుగుతాడు. మీ అబ్బాయి విడాకులు ఇస్తానన్నాడు అందుకే అని అనామిక అనగానే.. ఎందుకు ఇస్తానని అన్నాడో తెలియదా అని ప్రకాష్ అనగానే.. మీకు మతిమరుపు ఉందని లోకంలో అందరూ బుర్రతక్కువ వాళ్లే ఉంటారనుకుంటున్నారా అని అనామిక అనగానే.. కళ్యాణ్, ధాన్యలక్ష్మిలు అనామికపై విరుచుకుపడుతారు. ఏం చేసినా చెల్లుతుందనుకుంటుందేమో ఎలాంటి వాల్యూ లేకుండా చేస్తామని అనామికని ఇందిరాదేవి హెచ్చరిస్తుంది. ఇప్పటివరకు ఇది భార్యభర్తలకి సంబంధించిన విషయం.. ఇప్పుడు కుటుంబం పరువు విషయం.. మీ అమ్మాయి నోటిని అదుపులో పెట్టుకుమని చెప్పండి. మా అబ్బాయికి మేమ్ సర్ది చెప్పుకుంటామని ప్రకాష్ అనగానే.. ఇంత మంది మా అమ్మాయిని తప్పు పడుతున్నారు. మీ అబ్బాయి వేరే దానితో కులుకుతున్నాడు కదా అని అనామిక తండ్రి అంటాడు. దాంతో స్వప్న తనపై ఆవేశంగా వెళ్తుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నావ్ సర్ది చెప్పాడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. ఇంత దిగజారి మాట్లాడడం అవసరమా అని అపర్ణ అనగానే.. దిగజారుడు గురించి మీరే మాట్లాడాలి.. నీ భర్త వేరొక దానితో తిరిగి ఒక బాబుని కూడా తీసుకొని వచ్చాడని అనగానే ఏం మాట్లాడుతున్నావంటూ రాజ్ కోప్పడతాడు. అలా అనామిక ఇంట్లో ఎవరికి వాల్యూ ఇవ్వకుండా మాట్లాడేసరికి.. కళ్యాణ్ కి కోపం వచ్చి నీ కూతురుని తీసుకొని ఇక్కడ నుండి వెళ్లిపోరా అని అనామిక వాళ్ళ నాన్నని అంటాడు. వెళ్తాను నిన్ను వదిలి పెట్టను.. నీ అంతటా నువ్వే వచ్చి కాళ్ళమీద పడి క్షమించమని అడిగేలా చేస్తానని అనామిక సవాలు విసిరి వెళ్తుంది. ఈ రోజు హాయిగా పడుకుంటానని కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు.

ఆ తర్వాత ధాన్యలక్ష్మి దగ్గరికి కావ్య వచ్చి.. బాధపడకండి అత్తయ్య అని అంటుంది. ఇదంతా నీ వళ్లే కదా అని ధాన్యలక్ష్మి తిడుతుంటే.. అపర్ణ వచ్చి కావ్యకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఇంకొకసారి నా కోడలు గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదని ధాన్యలక్ష్మికి అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అనామిక తనకి అన్యాయం జరిగిందంటూ న్యూస్ లో డిబేట్ లో వస్తుంది. అది దుగ్గిరాల ఫ్యామిలీ చూసి షాక్ అవుతారు. తరువాయి భాగంలో కళ్యాణ్ కి విడాకులు ఇప్పిద్దామనుకుంటున్నానని రాజ్ అంటాడు. మరోవైపు పోలీసులు కళ్యాణ్ అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. మీ భార్యని డివోర్స్ ఇవ్వమని టార్చర్ చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిందని అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.