English | Telugu

Eto Vellipoyindhi Manasu : రేపటిలోగా దొంగని కనిపెడతా.. లేదంటే ఇళ్ళు వదిలి వెళ్ళిపోతా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు' ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -138 లో....రామలక్ష్మి దొంగతనం చేసిందని శ్రీవల్లి, శ్రీలతలు అంటుంటే.. సీతాకాంత్ మౌనం గా ఉంటాడు. నువు రామలక్ష్మి దొంగతనం చేసిందంటే నమ్మలేకపోతున్నావ్.. అందుకే ఏం మాట్లాడలేకపోతున్నావని సీతాకాంత్ తో శ్రీలత అంటుంది. అప్పుడే ఆపండి అంటు ధన కోప్పడుతాడు. మా అక్కకి కష్టపడే గుణము ఉంది కానీ ఇలాంటి దొంగ బుద్ది లేదు.. కష్టపడి మా కుటుంబాన్ని పోషించిందని ధన‌ అంటాడు.

అవును వదినకి ఒక రింగ్ దొరికితేనే అంత బయపడి వాళ్ళది వాళ్ళకి ఇచ్చేవరకు ప్రశాంతంగా లేదని సిరి అంటుంది. రామలక్ష్మి దొంగతనం చేసింది అనడం అర్థం లేదని పెద్దాయన అంటాడు.మరి రామలక్ష్మి లాకర్ లో పెట్టిన నగలు తనకి తెలియకుండా ఎలా మాయం అవుతాయని శ్రీలత అంటుంది. మీరు ఆపండి ఇప్పుడే మా నాన్నని రమ్మని పిలుస్తానంటూ ధన మాణిక్యానికి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్తాడు. ఆ తర్వాత మాణిక్యం ఇంట్లోకి వస్తాడు. ఏమైందని అడుగుతాడు. అసలు నువ్వు ప్రొద్దున ఎందుకు వచ్చావ్ అని ధన అడుగుతాడు. మందు తాగడానికి డబ్బుల కోసమని మాణిక్యం చెప్పగానే.. చూసారా అనవసరంగా మా రామలక్ష్మి దొంగతనం చేసిందని అంటున్నారు అని ధన అంటాడు. ఈ తండ్రి కూతుళ్ళు ముందే ఒక మాట అనుకుని ఉన్నారేమోనని శ్రీవల్లి అంటుంది. నా కూతురు అలాంటిది కాదని మాణిక్యం అంటాడు. ఈ స్థానంలో ఎవరున్నా నగలు పోవడం వెనకాల కారణం నీ కూతురే అనుకుంటారని శ్రీలత అనగానే.. నేను మాత్రం నువ్వే అనుకుంటాను.. నువ్వే దొంగతనం చేసి నా కూతురు పైన నెడుతున్నావ్.. నా కూతురు నీ కొడుకుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు.. అందుకే తనని ఇంట్లో నుండి పంపాలని ఇదంతా చేస్తున్నావని మాణిక్యం అంటాడు.

అలా మాట్లాడతావేంటని అని మాణిక్యం పైకి సీతకాంత్ పైర్ అవుతాడు. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్లే కనిపెడుతారని ధన ఫోన్ చేస్తుంటే.. రామలక్ష్మి ఆపి ఈ కుటుంబం పరువు కాపాడి, నా పై పడ్డ నిందని పోగొట్టుకునే అవసరం ఉంది.. రేపటివరకు ఈ దొంగతనం ఎవరు చేసారో కనిపెడుతానని రామలక్ష్మి అంటుంది. ఒకవేళ చేయకుంటే అని శ్రీవల్లి అనగానే.. ఇంట్లో నుండి వెళ్ళిపోతానని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఈ సమస్య నుండి ఎలా బయటకు వస్తావ్ అల్లుడు కూడా సైలెంట్ గా ఉన్నాడని మాణిక్యం అనగానే.. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో.. నీ వల్లే వాళ్ళకి ఛాన్స్ దొరికిందని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.