English | Telugu

Karthika Deepam2 : నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు.. బావతో పెళ్ళి జరిగేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -86 లో... జ్యోత్స్నతో పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి కార్తీక్ అందరిని రెస్టారెంట్ కి పిలుస్తాడు. అదే రెస్టారెంట్ కి కావేరిని స్వప్న తీసుకొని వస్తుంది. వాళ్ళు రావడం చూసిన దీప.. శ్రీధర్ కి సైగ ద్వారా వాళ్ళని చూపిస్తుంది. వాళ్ళను చూసిన శ్రీధర్ కంగారుగా మళ్ళీ వస్తానంటూ పక్కకు వెళ్తాడు. కావేరి స్వప్నలు కార్తీక్ వాళ్ళున్న వైపు వస్తుంటే.. మేనేజర్ ఆపుతాడు. దాంతో కార్తీక్ పిలిచి మనవాళ్లే పంపించమని చెప్పగానే వాళ్ళు లోపలికి వస్తారు.

కార్తీక్ అందరికి స్వప్న, కావేరిలని పరిచయం చేస్తాడు. నీ కాలు నొప్పి ఎలా ఉందని స్వప్నని కాంచన అడుగుతుంది. కాసేపటికి మీ నాన్న ఎక్కడ ఇంకా రావడం లేదని కార్తీక్ తో కాంచన అనగా.. వస్తారులే మీరు కూర్చోండని స్వప్న వాళ్లకు కార్తిక్ చెప్తాడు. ఇక స్వప్న అందరిని పరిచయం చేసుకుంటుంది. హ్యాండ్ వాష్ కోసం అంటు శ్రీధర్ దగ్గరికి దీప వెళ్తుంది. నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదని శ్రీధర్ అంటాడు. నేను మీ కోసం ఇదంతా చెయ్యలేదు.. పాపం కాంచన గారికి నిజం తెలిస్తే తట్టుకోలేదని దీప అంటుంది. మీరు అందరి జీవితాలతో ఆడుకుంటున్నారని శ్రీధర్ తో దీప అంటుంది. ఆ తర్వాత ఈ దీప ఎక్కడికి వెళ్ళిందంటూ జ్యోత్స్న బయటకు వస్తుంది. దీప, శ్రీధర్ తో మాట్లాడుతుందేంటి.. ఈ దీప ఏదో చేస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. కాసేపటికి దీప లోపలికి వస్తుంది అప్పుడే ఇక మేమ్ వెళ్తామంటూ కావేరి , స్వప్న లు అంటుంటే.. ఉండండి అని కార్తీక్ అంటాడు. వెళ్లనివ్వండి అని దీప అనగానే..కార్తీక్ ఆశ్చర్యంగా చూస్తాడు. మేమ్ ఏం ఉండడం లేదని కావేరి కోపంగా అంటుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీధర్ వస్తాడు. ఇప్పుడు పెళ్లి గురించి చెప్పడం కరెక్ట్ కాదని కార్తీక్ అనుకొని.. ఇప్పుడు పెళ్లి గురించి వద్దని అంటాడు.

కశౌర్యకి ఐస్క్రీమ్ తీసుకోవడానికి కార్తిక్ వెళ్తాడు. బావ నాతో పెళ్లి గురించి మాట్లాడకుండా ఈ దీప చేస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు దీప అని కార్తీక్ అంటాడు. శ్రీధర్ గురించి కార్తీక్ కి చెప్పాబోతుంది. అప్పుడే శౌర్య వస్తుంది. నాకు నీరసంగా ఉందని దీప శౌర్యని తీసుకుని వెళ్తుంది. మరొకవైపు జ్యోత్స్న జరిగింది మొత్తం పారిజాతానికి చెప్తుంది. నన్ను బావ పెళ్లి చేసుకోవడం ఆ దీపకి ఇష్టం లేదని జ్యోత్స్న పారిజాతానికి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.