English | Telugu

Brahmamudi : భార్యని టార్చర్ చేయలేదనడానికి సాక్ష్యం కావాలి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -451 లో... అనామిక ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు కళ్యాణ్ ని అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. ఇప్పుడు మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అది కళ్యాణ్ హ్యాపీగా ఉండేలా చూడాలని ధాన్యలక్ష్మితో రాజ్ అనగానే.. నాకేం అర్థం కావడం లేదు రాజ్.. మీ ఇష్టమని ధాన్యలక్ష్మి అంటుంది. కళ్యాణ్ నువ్వు ధైర్యంగా వెళ్ళు న్యాయం మనవైపు ఉందని కళ్యాణ్ కి రాజ్ చెప్తాడు. ఆ తర్వాత పోలీసులు కళ్యాణ్ ని తీసుకెళ్తారు.

మరొకవైపు బంటుగాడు అప్పు దగ్గరికి వచ్చి.. కళ్యాణ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారని అనగానే.. అప్పు కంగారు గా వెళ్తుంటే కనకం ఆపుతుంది. ఎక్కడికి వెళ్ళేది.. నీతో తిరగడం వల్లే ఆ అనామిక కళ్యాణ్ పైన కేసు పెట్టింది. ఇప్పుడు నువ్వు వెళ్తే అది అనుకున్నదే నిజం చేసినట్టు అవుతుందని అప్పుతో కనకం అంటుంది. అక్కడ నా ఫ్రెండ్ ప్రాబ్లెమ్ లో ఉన్నాడు అమ్మ అని అప్పు చెప్పి వెళ్లిపోతుంటే.. నువ్వు ఇక్కడ నుండి వెళ్తే నేను చచ్చినట్టే అని కనకం తన పైన ప్రామిస్ వేయించుకుంటుంది. ఆ తర్వాత రాజ్ లాయర్ తో మనం ఎక్కడ తగ్గకూడదని మాట్లాడుతుంటే.. అప్పుడే కావ్య వచ్చి మీరు కూడా మీ తమ్ముడికి విడాకులు ఇప్పించాలని ఫిక్స్ అయ్యారా అని అడుగుతుంది. వెళ్తు వెళ్తు అనామిక ఏం అందో విన్నావు కదా అని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ దగ్గరికి అపర్ణ వచ్చి విడాకులు ఇప్పించక తప్పదా అని అడుగుతుంది. కళ్యాణ్ సంతోషంగా ఉండాలంటే తప్పదని రాజ్ అంటాడు.

అనామిక ఇంత పిచ్చిది ఏంట్రా.. మనం ఏం చెప్తే అది చేసింది. ఇప్పుడు ఏకంగా కళ్యాణ్ ని అరెస్ట్ చేయించింది. ఇప్పుడు మనం ఒకటి చేయాలి. రేపు దుగ్గిరాల ఫ్యామిలీ కోర్ట్ కి వెళ్తారు కదా.. అక్కడ మీడియా వాళ్ళని పిలిపించాలి. అప్పుడు ఇంకా పరువుపోతుంది ఇది కూడా అనామిక వల్లే అని దుగ్గిరాల ఫ్యామిలీ తనపై ఇంకా కోపంగా ఉంటారని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి. మరుసటి రోజు కోర్ట్ ముందు కళ్యాణ్ కి నెగెటివ్ గా నినాదాలు చేస్తుంటారు. అప్పుడే రాజ్ వాళ్ళు వస్తారు. మీడియా వాళ్ళు ప్రశ్నలతో వేధిస్తుంటారు. ఆ తర్వాత కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ ని కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటారు.

తరువాయి భాగంలో తన వైఫ్ ని ఎలాంటి టార్చర్ చెయ్యలేదు.. తనే ఇదంతా కావాలని చేస్తుందని ప్రూఫ్ తీసుకొని రావాలని కళ్యాణ్ తరుపున లాయర్ చెప్తాడు. ఆ తర్వాత తప్పు అయిందని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళండి అని అనామిక అంటుంది. అది జరగదు అని కళ్యాణ్ అంటాడు. అయితే లాయర్ సాక్ష్యం తీసుకొని రమ్మని చెప్తున్నాడని అనామిక అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.