English | Telugu

గంగవ్వ ఫాస్ట్ ఫుడ్ సెంటర్...కస్టమర్స్ కి క్వాలిటీగా ఎగ్ ఫ్రైడ్ రైస్


విలేజ్ షో-మిక్స్ అనే యూట్యూబ్ చానెల్ లో 'గంగవ్వ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ' అనే వ్లాగ్ నాలుగు లక్షల వ్యూస్ దాటి టాప్-5 లో నిలిచింది.

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాలోని సాంగ్ తర్వాత గంగవ్వ వ్లాగ్ ఉండటంతో దీనికి మరింతగా క్రేజ్ వస్తోంది. ఇక ఆ తర్వాత కొన్ని సాంగ్స్ , సీరియల్ ప్రోమోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. అసలు గంగవ్వ వ్లాగ్ ఇంతగా ఫేమస్ కావడానికి కారణం ఏంటి? అసలు ఏం ఉంది ? ఎందుకు ఇంతలా ట్రెండింగ్ లోకి వచ్చిందో ఓసారి చూసేద్దాం.

తెలంగాణాలోని ప్రతీ గ్రామంలో గంగవ్వ చేసిన వ్లాగ్స్ కనిపిస్తుంటాయి. ఆమెని ఇన్ స్పైర్ చేసుకొని కొన్ని గ్రామాలలోని వాళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నారు. బయట వచ్చే సిచువేషన్ ని బట్టి సీన్లు చేయడం, మొబైల్ లోనే ఎడిట్ చేసి వాటిని వారి సొంత యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తున్నారు. అయితే గంగవ్వ బిగ్ బాస్ కి వెళ్ళి ప్రపంచమంతా తెలిసింది. ఆ తర్వాత తన రూటే సపరేట్ అయింది. దుబాయ్ కి కూడా వెళ్ళి అక్కడ ఓ ఈవెంట్ లో మాట్లాడింది. అలా గంగవ్వ ఫేమస్ అయింది. తను ఇలా అవ్వడానికి అనిల్ జీలా ప్రధాన కారణం. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ లో తనతో మాట్లాడించి, డైలాగ్స్ చెప్పించి ఫేమస్ చేసాడు. అందుకే అనిల్ జీలాకి కూడా తెలంగాణలో ఎంతో మందికి మార్గనిర్దేశం అయ్యాడు.

గంగవ్వ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనే వ్లాగ్ ఇంతలా ట్రెండింగ్ లో ఎందుకు ఉందంటే.. తను ఉండే ఊరికి సమీపంలో దీనిని మొదలెట్టింది గంగవ్వ. అయితే అక్కడికి వచ్చే కస్టమర్స్ కి క్వాలిటీగా ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్, చికెన్ ప్రైడ్ రైస్ లాంటివి ఇస్తూ తక్కువ డబ్బులు తీసుకుంటుంది. దాంతో ఆ హోటల్ కి దగ్గరగా ఉన్న ఊర్లో వాళ్ళు వాహనాల మీద వెళ్ళి మరీ తింటున్నారు. ఆయితే గంగవ్వ చేసే ఏ వ్లాగ్ లోను వల్గారిటీ లేకుండా చూసుకోవడంతో అందరు ఆమె చేసిన వ్లాగ్స్ చూడటానికి ఇష్టపడతారు.‌ అంతకముందు ప్రజల వద్దకే ఛాయ్ అంటు ఓ వ్లాగ్ చేయగా అది కూడా ఇలాగే ఫుల్ వైరల్ అయింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.