English | Telugu
రమ్యకృష్ణపై సంచలన కామెంట్స్ చేసిన వనితా విజయ్ కుమార్!
Updated : Jul 11, 2024
కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్ , దివంగత మంజుల కుమార్తె వనితా విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె.. రెగ్యులర్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇక తల్లిదండ్రులిద్దరూ అగ్ర నటులు కావడంతో వనితా విజయ్ కుమార్ చాలా సులభంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ‘చంద్రలేఖ’ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె .. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమెకు అవకాశాలు పెరిగాయి. కానీ తను పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే మళ్ళీ తన కెరీర్ ని మొదలెట్టింది వనితా విజయ్ కుమార్.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వనితా విజయ్ కుమార్ తన వైవాహిక జీవితం, కుటుంబ సమస్యలు, కెరీర్‌పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘బిగ్‌బాస్ జోడిగల్’ అనే రియాలిటీ షో నుంచి ఆమె అర్ధాంతరంగా తప్పుకోవడం పై వనితా విజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేసింది. సీనియర్ నటి రమ్యకృష్ణ వల్లే తను షోకు దూరమయ్యానని చెప్పింది. ఓ రోజున అమ్మవారి వేషంలో వనిత డాన్స్ చేసింది. అప్పుడు ఆ షోకు జడ్జిగా వ్యవహరించిన రమ్యకృష్ణ.. మేకప్ బాగుంది కానీ , డ్యాన్స్ సరిగా కంపోజ్ చేయలేదన్నట్లుగా కామెంట్ చేసిందంట. దాంతో వనిత స్టేజ్ పైనే కోపడ్డదంట. జడ్జ్‌మెంట్ ఇవ్వకుండా మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇతర కంటెస్టెంట్స్‌తో తన డ్యాన్స్‌ను పోల్చడం ఏంటంటూ ఫైర్ అయ్యింది. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరో జడ్జి కూడా రమ్యకృష్ణకు మద్ధతుగా నిలవడంతో వనిత కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వనిత తిరిగి ఆ షోలో పాల్గొంది. తనకు రమ్య చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆమె అద్భుతమైన నటి అని వనితా విజయ్ కుమార్ పొగిడేసింది. రమ్యకృష్ణతో ఎలాంటి గొడవ పడలేదని.. కేవలం ఆమె జడ్జిమెంట్ చెప్పిన విధానాన్ని తాను తప్పు పట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది.