ఆమెని ఏడ్పించారు.. ఇతను స్టేషన్ కి వెళ్ళాడు!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -461 లో....అపర్ణ, సుభాష్ ల పెళ్లి రోజు సందర్భంగా ఇంట్లో ఫన్నీ గేమ్స్ ఆడుతారు. కేక్ కట్ చెయ్యడానికి ఇద్దరు రెడీగా ఉంటారు. అప్పుడే రుద్రాణి కావాలనే పనిమనిషిని జ్యూస్ తీసుకొని రమ్మని చెప్తుంది. పనిమనిషి అపర్ణ ఇచ్చిన చీర కట్టుకొని వచ్చి అందరికి జ్యూస్ ఇస్తుంటే.. ఆ చీర చూసిన రాజ్, కావ్య, సుభాష్ లు షాక్ అవుతారు.