English | Telugu

అషు రెడ్డి గిలిగింతలు.. బంగారు వర్ణపు ధగధగలు!

ఇన్ స్టాగ్రామ్ లో చిన్న చిన్న సెలెబ్రిటీలు చేసే ఫోటోషూట్స్ కొన్ని వైరల్ అవుతుంటాయి. మరీ బోల్డ్ గా ఉండేలా కొంతమంది చేసేవి ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారి లిస్ట్ లో అషు రెడ్డి, అనసూయ, ఇనయా, అరియానా, సుభశ్రీ రాయగురు ఉన్నారు. వీరు రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు వీడియోలతో వైరల్ అవుతుంటారు.

అషు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ గా హీట్ పుట్టించే ఫొటోస్ పెట్టి సందడి చేస్తూ ఉంటుంది. అషు తరచుగా కల్చరల్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటుంది. ఐతే ఎన్ని ప్రోగ్రామ్స్ లో ఉన్నా కూడా సమయం తీసుకుని మరీ సోషల్ మీడియాలో తన ఫొటోస్ షేర్ చేస్తూ ఆడియన్స్ కి టచ్ లో ఉండడం మాత్రం అస్సలు మర్చిపోదు. బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు అషు పెద్దగా పరిచయం లేని పేరు. బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమ్ తో పాటు తనకంటు ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఆర్జీవీతో అషురెడ్డి కలిసి చేసిన ఒక వీడియో ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో ఈ వీడియో గురించి నెటిజన్ల నెగెటివ్ కామెంట్స్ తో పెద్ద డిబేటే జరిగింది.

ఒక కాఫీ షాప్ లో అషురెడ్డి పొట్టి డ్రెస్ లో కూర్చొని ఉండగా.. ఆర్జీవీ తన థైస్ ని బాగున్నాయని అనగా, ఆమె చెంపమీద కొట్టడంతో ఆ ఇంటర్వ్యూ కూడా అప్పట్లో వైరల్ అయింది. తాజాగా గోల్డ్ కలర్ డ్రెస్ లో హాట్ అండ్ బోల్డ్ ఫోటోలని షేర్ చేయగా.. వీటికి పాజిటివ్ కంటే కూడా నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా వస్తున్నాయి‌. ఇలా హాట్ ఫోట్ షూట్స్ తో నెటిజన్లకి ట్రీట్ ఇవ్వడం అషురెడ్డికి అలవాటే మరి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.