English | Telugu

కోల్గేట్ పేస్ట్‌పై వేప పుల్లతో కౌశల్ పోరాటం!


కౌశల్ మందా గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యధిక ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్‌గా కౌశల్ మందా. కౌశల్ ఆర్మీ కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 2 టైములో కౌశల్ ఇమేజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఆయన కోసం అప్పట్లో చాలా కార్యక్రమాలు చేసారు. తనను తాను ఓ హీరోలా ప్రొజెక్ట్ చేసుకున్నాడు కౌశల్. నానిపై కూడా కౌశల్ అభిమానులు ఫైర్ అయ్యే రేంజ్ లో ఉంది కౌశల్ పవర్ . అలాంటి కౌశల్ తర్వాత కొన్ని షోస్ చేసాడు. తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ పెడుతూ ఉంటాడు. వాళ్ళ పిల్లల్తో కలిసి చేసిన వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటాడు.

రీసెంట్ గా అలాంటి ఒక వీడియోని పోస్ట్ చేసాడు . వాళ్ళ అమ్మాయిని వేప చెట్టు దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ వేప పుల్ల విరిచి చేతికి ఇచ్చాడు. ప్రపంచంలోకి ఇదే బెస్ట్ టూత్ పేస్ట్ అని చెప్పాడు. వారానికి ఒక్కసారైనా వేప పుల్లతో పళ్ళు తోముకుంటే పళ్లలో ఉండే బాక్టీరియా అంతా చచ్చిపోతుంది అని చెప్పాడు. ఇక తన కొడుకు, కూతురు, మరో బాబుకు కూడా వేప పుల్లలు ఇచ్చి పళ్ళు తోమించాడు. మా తాతల టైంలో ఈ వేపపుల్లలతోనే తోముకునే వాళ్ళు, తర్వాత బొగ్గుతో తోముకునే వాళ్ళు, ఆ తర్వాత పేస్ట్ లు వచ్చాయి అని తన కూతురికి ఎక్స్ప్లైన్ చేసాడు. ఈ వీడియో చూసాక నెటిజన్స్ అంతా కూడా తమ చిన్నప్పుడు వేప పుల్లతోనే పళ్ళు తోముకునే వాళ్ళం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.