50కోట్ల క్లబ్ లో లెజెండ్
నందమూరి బాలకృష్ణ నటించిన "లెజెండ్" సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వారాహి చలన చిత్ర సాయి కొర్రపాటి సమర్పణలో, 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించారు. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలు. జగపతి బాబు విలన్ పాత్రలో మొదటిసారిగా నటించి అదరగొట్టాడు.