Home

»

Latest News

సౌందర్య వర్ధంతి నేడు

Apr 17, 2014

 

అసలు పేరు సౌమ్య. కానీ జనాలకు తెలిసింది మాత్రం సౌందర్య. అందం, అభినయం ఆమె సొంతం. తెలుగు, తమిళ. కన్నడ, మలయాళ భాషలలో మొత్తం కలిపి దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించింది. నటిగా అప్పట్లో అందరూ సావిత్రిని ఆదర్శంగా తీసుకునేవారు. కానీ నటి అంటే అన్ని రకాల పాత్రలు చేయాలని నిరూపించింది సౌందర్య. నటిగా తనను తాను నిరుపించుకుంటూ గ్లామర్ పాత్రలను సైతం చేసి అభిమానులను అలరించింది. తన నటనకు ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. సావిత్రి తర్వాత అంతటి నటిగా పేరు తెచ్చుకున్న ఏకైక నటి సౌందర్య. అలాంటి సౌందర్య వర్ధంతి నేడు.

2004లో జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజేపి పార్టీ తరపున ప్రచారం చేయడానికి చార్టెడ్ విమానంలో బయలుదేరారు సౌందర్య. దురదృష్టవశాత్తూ విమానం గాలిలోకి ఎగిరిన కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణంలో కుప్పకూలి పడిపోయింది. దాంతో ఆ విమానంలో ఉన్నవాళ్ళందరూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఆమె మరణం ఇప్పటికి కూడా బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుందాం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com