Home

»

Latest News

మనోజ్ కరెంట్ తీగ అవుతాడా ?

Apr 16, 2014

 

మంచు మనోజ్ హీరోగా ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం అందరికి తెలిసిందే. మనోజ్ ప్రస్తుతం ముద్దుగా, బొద్దుగా తయారయ్యాడు. అయితే ఈ చిత్రానికి "కరెంటు తీగ" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మరి ఈ టైటిల్ ను ఖరారు చేస్తారో లేక వేరే టైటిల్ ను పెడతారో త్వరలోనే తెలియనుంది. మే రెండో వారంలో సెట్స్పైకి వెళ్లనుంది. ఇందులో మనోజ్ సరసన "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" ఫేం రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. కామెడి ఎంటర్ టైనర్ తో సాగే చిత్రమిది. మణిశర్మ సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com